అమెరికా కి భారత్ కంటే పాకిస్థాన్ చాలా మిత్ర దేశం

ఇండియా తో అనేక ద్వైపాక్షిక మరియు పెట్టుబడులు అగ్రిమెంట్లు చేసుకున్న డోనాల్డ్ ట్రంప్ తిరిగి అమెరికా వెళ్లడం జరిగింది. కాగా అమెరికాలో విమానం దిగగానే మోడీ తన అసలు రంగు బయటపెట్టినట్లు అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి.అమెరికా కి భారత్ కంటే పాకిస్థాన్ చాలా మిత్ర దేశం. పాకిస్తాన్ ఆయుధాలను ఎక్కువగా అమెరికా దగ్గర కొంటుంది. ఇటువంటి తరుణంలో భారత్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాడికల్ ఇస్లాంని మరియు టెర్రరిస్టులను ప్రోత్సహించేది లేదని మాట్లాడిన డోనాల్డ్ ట్రంప్ అమెరికా వెళ్లేసరికి పాకిస్తాన్ తన మిత్ర దేశం అని భారత్ మరియు పాకిస్తాన్ దేశానికి సమస్యగా ఉన్న కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం చేస్తానని డోనాల్డ్ ట్రంప్ మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఇది ఖచ్చితంగా మోడీ కి వెన్నుపోటు పొడిచినట్టు అని ఇంటర్నేషనల్ మీడియా సంస్థ డోనాల్డ్ ట్రంప్ వ్యవహారాన్ని అభివర్ణించింది.అయితే భారత్ లో కూడా ట్రంప్ ఈ మాటలు అన్నారు .. రెండు దేశాలు అమెరికాకి కావాలి, వారికి బిలియన్ డాలర్ల ఆయుద వ్యాపారం ఈ రెండు దేశాలతో అవసరం.. అందుకే ఇటు కర్ర విరక్కుండా పాము చావకుండా ట్రంప్ తెలివిగా వ్యవహరించారు.భారత్ వచ్చిన సమయంలో ఇక్కడ కూడా అదే అన్నారు.. పాక్ భారత్ మధ్య కాశ్మీర్ అంశాన్ని కావాలంటే చర్చించి పరిష్కరిస్తాం అన్నారు, భారత్ సోమ్ముతో సత్కారాలు చేస్తే, పాకిస్ధాన్ పై ప్రేమ వలగపోవడం ఏమిటి అని చాలా మంది విమర్శలు చేశారు. మరి చూడాలి ట్రంప్ వచ్చే రోజుల్లో ఇంకెన్ని మాటల తూటాలు వదులుతారో.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *