అల వైకుంఠపురములో’ చిత్రం టాక్….
‘అల వైకుంఠపురములో’ చిత్రం టాక్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం‘అల వైకుంఠపురములో’, హీరోయిన్గా పూజా హెగ్డే ఖాతాలో మరో మంచి సక్సెస్ పడినట్టేనని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. టబు, రోహిణిలు డెలివరీకి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే సీన్‌తో సినిమా మొదలు అవుతుంది. ఫస్టాఫ్ మొత్తం కామెడీ, ఎమోషన్స్‌తో త్రివిక్రమ్ నడిపించారు. సినిమాకు కామెడీ హైలైట్‌గా నిలిచింది. సుశాంత్, నివేతా పేతురాజ్, సునీల్, బ్రహ్మాజీ, నవదీప్, సముద్రఖని తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. రాజేంద్రప్రసాద్, తనికెళ్ల భరణి పాత్రలు సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. డాక్టర్‌గా వెన్నెల కిషోర్ తనదైన స్టైల్లో కామెడీని పండించారు. ఎమోషన్స్‌తో త్రివిక్రమ్ నడిపించారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ డైలాగ్ పవర్ బ్యాక్ బోన్‌గా నిలిచింది. మెగాస్టార్ సాంగ్‌తో బన్నీ అభిమానులతో విజిల్స్ వేయించుకున్నాడు. మొత్తంగా ఈ సినిమా అటు బన్నీకి, ఇటు త్రివిక్రమ్‌కు మంచి సక్సెస్‌ని ఇవ్వడంతో పాటు.. అభిమానులకు సంక్రాంతికి అతి పెద్ద ట్రీట్ అవుతుంది.