అ! ఓవర్సీస్ లో మాత్రం దుమ్ము రేపుతోంది

టాక్ తేడాగానే ఉంది. ఓవర్సీస్ లో మాత్రం దుమ్ము రేపుతోంది. సినిమా చూసివచ్చిన ప్రేక్షకులు అయోమయంలో కొంత పెదవి విరుస్తున్నారు కాని చూడాలి అనుకున్న వాళ్ళను మాత్రం ఆపలేకపోతున్నారు. మొత్తానికి సినిమాలో చూపించిన గందరగోళంలాగే అ! వసూళ్లు కూడా ఉన్నాయి. ఇప్పటికే యుఎస్ లో అర మిలియన్ మార్క్ దాటేసిన అ! హాలీవుడ్ సినిమా బ్లాంక్ పాంథర్ ఎఫెక్ట్ వల్ల ఎక్కువ స్క్రీన్స్ దక్కించుకోలేదు కాని ఈ శుక్రవారం నుంచి అదనంగా జోడించబోతున్నారు.

ఇక ఇక్కడి విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో సిటీలు మినహాయిస్తే బిసి సెంటర్స్ లో మాత్రం మూడు రోజుల తర్వాత బాగా డ్రాప్ రికార్డు అవుతోంది. అయినప్పటికీ మౌత్ టాక్, రివ్యూలు సినిమాపై ఆసక్తి కలిగేందుకు దోహదం కలిగిస్తున్నాయి. హీరో లేని సినిమా కావడం, మాస్ కు అర్థమయ్యేలా కంటెంట్ ప్రెజెంట్ చేయకపోవడం అక్కడ ఎఫెక్ట్ చూపిస్తోంది.

ఇక వసూళ్ళ విషయానికి వస్తే మొదటి మూడు రోజులకు గాను 9.5 కోట్ల దాకా గ్రాస్ తో సుమారు 4.5 కోట్ల దాకా షేర్ అ! ఇచ్చినట్టు ట్రేడ్ సమాచారం. ఇందులో ఓవర్సీస్ సింహభాగం ఆక్రమించినప్పటికి అమ్మిన రేట్ల ప్రకారం చూసుకుంటే ఇది చాలా సేఫ్ వెంచర్ గా మిగిలే అవకాశాలు ఉన్నాయి. నైజాంలో 1 కోటి 90 లక్షల గ్రాస్ తో 1 కోటి 10 లక్షల షేర్ ఇచ్చిన అ! సీడెడ్ లో 40 లక్షల గ్రాస్-22 లక్షల షేర్ తో పర్వాలేదు అనిపించుకుంది. ఆంధ్ర ప్రాంతం విడిగా చూసుకుంటే 2 కోట్ల గ్రాస్ తో 1 కోటి 19 లక్షల షేర్ తో బాగానే రన్ అవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 4 కోట్ల 30 లక్షల గ్రాస్ తో 2.5 కోట్ల షేర్ తో పాస్ మార్కులు తెచ్చుకుంది.

చాలా లిమిటెడ్ బడ్జెట్ లో తీసిన అ! కు జరిగిన థియేట్రికల్ బిజినెస్ మొత్తం కలిపితే కేవలం 9 కోట్లే అని టాక్. ఈ లెక్కన సేఫ్ జోన్ లోకి ఎంటర్ కావడం ఈజీనే. ఫైనల్ రిపోర్ట్ ఎలా ఉన్నా నిర్మాత నానికి ఇది లాభాలు ఇవ్వడం ఖాయమని తేలిపోయింది. ఒకవేళ అవుట్ అఫ్ బడ్జెట్ వెళ్లి ఎక్కువ ధరలకు సినిమాను అమ్మింటే మటుకు నష్టాలు తప్పేవి కావు. నాని ఇక్కడ కూడా తమ స్మార్ట్ నెస్ చూపించి అందరిని సేవ్ చేసాడని చెప్పొచ్చు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *