ఉల్లి ధరలు పెరిగాయి ….. ఏ.పీ.లో ఉల్లి కిలో25రూ.

ఇక భారీగా పెరిగిన ఉల్లి ధరలతో సామాన్య ప్రజలకు ఉల్లిని కోయకుండానే కళ్ళలో నీళ్లు వచ్చే పరిస్థితి ఏర్పడింది. దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు మరింత పెరిగాయి. కొన్ని రోజులుగా ఉల్లి ధరలు పైపైకి వెళుతుండడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతోన్న చర్యలు సరైన ఫలితాలను ఇవ్వట్లేదు. గోవా రాజధాని పనాజీలో కిలో ఉల్లి రూ.165కు చేరింది. కోల్‌కతా, బెంగళూరుల్లో రూ.140, ముంబయి రూ.102, ఢిల్లీలో రూ.96కు చేరింది. ఇక దేశంలోని 14 ప్రధాన నగరాల్లో కిలో ఉల్లి ధర సగటున రూ.100 కంటే అధికంగా ఉంది.మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడంతో ఉల్లి దిగుబడి తగ్గి కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో ధరలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కేంద్ర సర్కారు ఉల్లి ఎగుమతులను నిలిపేసింది. అంతేగాక, పెద్ద ఎత్తున ఉల్లిని దిగుమతి చేసుకునే ఏర్పాట్లు చేసింది.
ఏ.పీ.లో ఉల్లి కిలో25రూ. …
కిలో25రూపాయల చొప్పున ఉల్లిని వినియోగదారులకు అందుబాటులో ఉంచనున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ముందస్తుగా నాసిక్ నుంచి మరో 300 టన్నులు కొనుగోలు చేయనుంది. మొత్తంగా 900 మెట్రిక్ టన్నుల అవసరం అవుతుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. ధరల స్థిరీకరణ నిధి నుంచి సబ్సిడీని భారాన్ని ప్రభుత్వం భరించనుంది. . కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో క్వింటాలు ధర 8,600 పలికింది. విజిలెన్స్ అధికారులు కర్నూలు నుండి ఇతర రాష్ట్రాలకు ఉల్లి ఎగుమతులను నిలిపివేయడంతో…. దీనితో ఏపీ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో వుండే విధంగా ఉల్లిని అందించాలని నిర్ణయం తీసుకుంది. ఉల్లి ధరలను అందుబాటు లోనికి తీసుకవచ్చేందుకు కర్నూలు నుంచి వంద మెట్రిక్ టన్నులను ప్రభుత్వం కొనుగోలు చేసింది. రేపటి నుంచి రైతు బజార్లలో కిలో25 రూపాయల చొప్పున సబ్సిడీ ధరలకు ఉల్లిని అందుబాటులో ఉంచనున్నారు…. రాష్ట్రంలోని ప్రజల అవసరాలను తీరకుండా ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయకూడదని అధికారులు నిర్ణయించడంతో ఉల్లి ఇతర ప్రాంతాలకు ఉల్లి ఎగుమతులు ఆగిపోయాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *