ఐపీఎల్‌ 2019 షెడ్యూలు విడుదల

ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌ 2019 సీజన్‌ షెడ్యూలును బీసీసీఐ విడుదల చేసింది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌, ప్రతిసారీ ఫేవరెట్‌గా బరిలోకి దిగే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తలపడతాయి. మార్చి 23, శనివారం సాయంత్రం చెన్నై వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది. కేవలం రెండు వారాలకే షెడ్యూలను ప్రకటించడం గమనార్హం. మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 5 వరకు నిర్వహించే మ్యాచ్‌ల‌ వివరాలే ప్రకటించారు.

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను అనుసరించి మిగతా మ్యాచ్‌ల వివరాలు ప్రకటిస్తారు. మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అందుకే క్రికెట్‌ పాలకుల కమిటీతో సమాలోచనల తర్వాత రెండు వారాల షెడ్యూలను నిర్వాహకులు ప్రకటించారు. ఎన్నికల షెడ్యూలు విడుదలైతే పరిస్థితులను బట్టి ప్రస్తుత రెండు వారాల షెడ్యూల్లో మార్పులు చేసేందుకు ఆస్కారం ఉంది.

రెండు వారాల వ్యవధిలో ఎనిమిది వేదికల్లో 17 మ్యాచ్‌లు జరుగుతాయి. అన్ని జట్లు నాలుగు, దిల్లీ క్యాపిటల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఐదు మ్యాచ్‌లు ఆడతాయి. రెండు సొంత మైదానం, రెండు ఇతర మైదానాల్లో ఉంటాయి. దిల్లీ మాత్రం మూడు సొంత మైదానంలో, బెంగళూరు మూడు ఇతర మైదానాల్లో ఆడనున్నాయి.


 

తొలి రెండు వారాల ఐపీఎల్‌ షెడ్యూల్‌..

1. మార్చి 23- చెన్నై సూపర్‌ కింగ్స్‌-రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(చెన్నై)

2. మార్చి 24- కోల్‌కతా నైట్‌రైడర్స్‌-సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(కోల్‌కతా)

3. మార్చి 24-ముంబై ఇండియన్స్‌-ఢిల్లీ కేపిటల్స్‌(ముంబై)

4. మార్చి 25- రాజస్తాన్‌ రాయల్స్‌-కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌(జైపూర్‌)

5. మార్చి 26- ఢిల్లీ కేపిటల్స్‌-చెన్నై సూపర్‌ కింగ్స్‌(ఢిల్లీ)

6. మార్చి 27-కోల్‌కతా నైట్‌రైడర్స్‌- కింగ్స్‌ పంజాబ్‌(కోల్‌కతా)

7. మార్చి 28-రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు-ముంబై ఇండియన్స్‌(బెంగళూరు)

8. మార్చి 29-సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌-రాజస్తాన్‌ రాయల్స్‌(హైదరాబాద్‌)

9. మార్చి 30- కింగ్స్‌ పంజాబ్‌-ముంబై ఇండియన్స్‌(మొహాలీ)

10. మార్చి 30- ఢిల్లీ కేపిటల్స్‌-కోల్‌కతా నైట్‌రైడర్స్‌(ఢిల్లీ)

11. మార్చి 31- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(హైదరాబాద్‌)

12. మార్చి 31-చెన్నై సూపర్‌ కింగ్స్‌-రాజస్తాన్‌ రాయల్స్‌(చెన్నై)

13. ఏప్రిల్‌ 1- కింగ్స్‌ పంజాబ్‌-ఢిల్లీ కేపిటల్స్‌(మొహాలీ)

14. ఏప్రిల్‌ 2- రాజస్తాన్‌ రాయల్స్‌- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(జైపూర్‌)

15. ఏప్రిల్‌ 3-ముంబై ఇండియన్స్‌- చెన్నై సూపర్‌ కింగ్స్‌(ముంబై)

16. ఏప్రిల్‌ 4- ఢిల్లీ కేపిటల్స్‌-సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(ఢిల్లీ)

17. ఏప్రిల్‌ 5- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు-కోల్‌కతా నైట్‌రైడర్స్‌(బెంగళూరు)

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *