”గల్లి బోయ్” గా సాయి ధరమ్‌ తేజ్‌?

రణ్‌వీర్‌ సింగ్‌, అలియా భట్‌ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన మ్యూజికల్ డ్రామా గల్లి బోయ్. జోయా అక్తర్ దర్శకత‍్వంలో రూపొందిన ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. ముఖ్యంగా సినిమాలో రణ్‌వీర్‌ పోషించిన రాప్‌ సింగర్‌, గుల్లి బోయ్ పాత్రకు సూపర్‌ రెస్పాన్స్‌ వస్తోంది. దీంతో ఇతర భాషల్లో ఈ సినిమాను రీమేక్‌ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

తెలుగులోనూ గల్లి బోయ్  రీమేక్‌ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ హీరోలు ఈ యూత్‌ఫుల్ రీమేక్‌లో నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్ర లహరి షూటింగ్‌లో బిజీగా ఉన్న సాయి ధరమ్‌ తేజ్‌ ఈ రీమేక్‌లో నటించేందకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. మరి నిజంగానే ఈ మెగా హీరో గల్లీ బాయ్ రీమేక్‌ను పట్టాలెక్కిస్తాడో లేదో చూడాలి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *