చెత్త లోని డబ్బామూతతీయడంతో పేలుడు

హైదరాబాద్ ముషిరాబాద్‌లో జరిగిన పేలుడు కలకలం రేపుతోంది. హరినగర్‌ కాలనీలోని ఓ చెత్తకుప్పలో పేలుడు సంభవించడంతో స్థానికులు  ఉలిక్కిపడ్డారు. చెత్తను సేకరిస్తున్న ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. కుప్పలో ఉన్న ఓ డబ్బా మూత తీయటానికి ప్రయత్నించగా ప్రమాదం జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బాంబ్ స్వ్కాడ్, క్లూస్ టీమ్‌ను రప్పించి తనిఖీలు చేపట్టారు. పేలుడు ఎలా సంభవించింది, ఆ బాక్స్‌‌ను అక్కడ ఎవరు పడేశారు? అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *