దిశ లివర్‌లో మద్యం పోసినట్లు

దిశ కేసులో పోలీసులకు మరో ఆధారం బలంగా మారింది. దిశ లివర్‌లో లిక్కర్‌ను ఫోరెన్సిక్‌ నిపుణులు గుర్తించారు.. అత్యాచారం సమయంలో దిశ నోట్లో నిందితులు బలవంతంగా మద్యం పోసినట్లు గుర్తించారు. రన్‌వే 44 వైన్స్‌లో నిందితులు మద్యం కొనుగోలు చేసినట్టు పోలీసులు సీసీఫుటేజ్‌ సేకరించారు. ఇప్పుడు ఆధారాలతో సహా ఫోరెన్సిక్ నివేదిక ధ్రువీకరించింది. దీన్ని బట్టి రుజువైంది. అంతేకాకుండా దిశ నిందితులపై ఇంతకుముందు నేరాలకు సంబంధించిన ట్రాక్ రికార్డ్ కూడా ఉందిదన్నది తెలిసిందే.

దిశ నిందితులు మహ్మద్ ఆరీఫ్, చెన్నకేశవులు, జొల్లు శివ, జొల్లు నవీన్ మృతదేహాలు గాంధీ ఆస్పత్రి మార్చురీలోన భద్రపరిచారు. అయితే ఇవి పాడవ్వకుండా ఉండాలంటే వాటికి 7500 రూపాయల ఇంజక్షన్లు  ఇస్తున్నారు. ఈ ఇంజక్షన్ ఇస్తే మృతదేహం పాడవ్వకుంటా ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. కోర్టు ఆదేశాల వచ్చేవరకు ఈ ఇంజక్షన్లు ఇస్తూ డెడ్ బాడీలు భద్రపరచాల్సి  ఉంటుంది. వారానికి ఒకసారి నాలుగు మృతదేహాలకు ఈ ఇంజక్షన్ చేస్తున్నారు. ప్రత్యేకంగా ఈ ఇంజక్షన్లు తెప్పించి ఇవ్వడం వల్ల దాదాపు నాలుగు నెలల పాటు డెడ్ బాడీలు చెడిపోకుండా ఉంటాయని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. కోర్టు ఆదేశాల వరకు గాంధీ ఆస్పత్రిలోనే డెడ్ బాడీలు ఉండనున్నాయి. కోర్టు తీర్పు నేపథ్యంలో మరికొన్ని రోజులు ఎదురుచూపులు తప్పేలా లేదు.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *