మహిళలను పారిశ్రామికవేత్తలుగా…

కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపీఐఐటీ) ఆధ్వర్యంలో మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారుచేయడానికి ఉద్దేశించిన వింగ్‌ కార్యక్రమాన్ని తెలంగాణలో వీ హబ్‌ భాగస్వామ్యంతో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంద్వారా దేశవ్యాప్తంగా ఏటా 7500 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారుచేయడానికి కేంద్రం నిధులు, సహకారం అందించనున్నది. శుక్రవారం జూబ్లీహిల్స్‌ అంబేద్కర్‌ యూనివర్సిటీ అవరణలోని వీహబ్‌ కార్యాలయంలో నిర్వహించిన వింగ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ మహిళా పారిశ్రామికవేత్తలకు భూముల కేటాయింపులో అదనపు రాయితీలు, సీడ్‌ క్యాపిటల్‌ అసిస్టెన్స్‌ అందిస్తున్నామని చెప్పారు.  వీహబ్‌ ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలను తయారుచేయడానికి రూ.15 కోట్ల కార్పస్‌ఫండ్‌ ఏర్పాటుచేశామని తెలిపారు. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు రూ.25 లక్షల నుంచి కోటి రూపాయల వరకు గ్రాంట్‌గా అందిస్తున్నామని చెప్పారు. జీఐజీ, ఆస్ట్రేలియన్‌ హైకమిషన్‌, స్విస్‌నెక్ట్స్‌, ఇంటెల్‌, మైక్రోసాఫ్ట్‌, ప్రాక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, సెల్స్‌ఫోర్స్‌ లాంటి సంస్థలతో వీహబ్‌ ఒప్పందం చేసుకుందన్నారు. ఇన్నోవేషన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇంక్లూజివ్‌ గ్రోత్‌ లక్ష్యంగా వీహబ్‌ను ఏర్పాటుచేశామన్నారు. దేశంలో మహిళా జనాభా పురుషులతో దాదాపు సమానంగా ఉన్నా.. పారిశ్రామికవేత్తల సంఖ్య తక్కువగా ఉన్నదని చెప్పారు. పారిశ్రామికవేత్తలుగా మహిళలు విజయవంతంగా కావడానికి అనేక అడ్డంకులు ఉంటాయన్నారు. ఈ కారణంగానే 14% మాత్రమే మహిళా పారిశ్రామికవేత్తలు ఉన్నారన్నారు. ఈ సందర్భంగా మహిళా స్టార్టప్‌లు తయారుచేసిన వస్తువుల ప్రదర్శనను మంత్రి కేటీఆర్‌ తిలకించారు. నేషనల్‌ స్టార్టప్‌ అవార్డులను అందించారు. కార్యక్రమంలో పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌, వీహబ్‌ సీఈవో దీప్తి తదితరులు పాల్గొన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *