మహేష్ అసెంబ్లీలో పోసాని రచ్చ

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల రేంజ్ ఇప్పుడు మాములుగా లేదు. సినిమా సినిమాకి తన అంచనాలు పెంచుకుంటూ ఇతర ఇండస్ట్రీలోను నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే స్పైడర్ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఆ సినిమా తెలుగుతో పాటు తమిళ్ లో కూడా తెరకెక్కిన విషయం తెలిసిందే. మొదటి సారి తమిళ్ బాక్స్ ఆఫీస్ పై మహేష్ డైరెక్ట్ ఎటాక్ చేయబోతున్నాడు. అయితే ఆ సినిమా సంగతి పక్కనపెడితే ప్రస్తుతం మహేష్ – భారత్ అనే నేను సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

రాజకీయ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడు. ఇక కొరటాల  శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. శ్రీమంతుడు తర్వాత వీరి కాంబోలో ఈ సినిమా వస్తుండడంతో భారీ అంచనాలు అలుముకున్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ లోని ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన అసెంబ్లీ సెట్ లో షూటింగ్ జరుగుతోంది. ఆ సెట్ లో పోసాని  ఎదో పరధ్యానంలో వెరైటీగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఆయన పక్కన జీవా- బెనర్జీ లు కూడా ఇందులో కనిపిస్తున్నారు. పోసాని పాత్ర ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతోందని తెలుస్తోంది.

మొదటి సారి తన గురువును బంధువును దర్శకుడు కొరటాల ఈ సినిమాలో చుపించాబోతున్నాడు. కొరటాల – పోసాని శిష్యుడే. ఆయన దగ్గర చాలా సినిమాలకు అసిస్టెంట్ రైటర్ గా వర్క్ చేశాడు. అలాగే పోసానికి దగ్గరి బంధువు కూడా.. ఇప్పటివరకు మూడు బాక్స్ ఆఫీస్ హిట్స్ తీసిన కొరటాల ఆ సినిమాల్లో పోసానికి ఏ పాత్ర ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మహేష్ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. మరి ఆ పాత్ర ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *