యాంకర్ రవి కారును డీసీఎం ఢీ కొట్టింది.

యాంకర్ రవి కారును ..

ఇటీవల సెలబ్రిటీలు వరుసగా ప్రమాదాలకు గురవుతున్నారు. రాజశేఖర్‌కు జరిగిన ప్రమాద ఘటన, సంపూర్ణేష్ బాబు ప్రమాద ఘటన మరువకు ముందే   టాలీవుడ్‌ యాంకర్ రవి కారుకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో యాంకర్‌ రవికి ఎలాంటి గాయలు జరగకపోయినా కారు మాత్రం డామేజ్‌ అయ్యింది. యాంకర్‌ రవి శనివారం ఉదయం హైదరాబాద్‌ మూసాపేట నుంచి బంజార్‌ హిల్స్‌ వైపు వస్తుండగా లక్ష్మీ కళా, శశికళా థియేటర్స్‌ ఎదురుగా భరత్‌ నగర్‌ ఫ్లై ఓవర్‌ ఎక్కుతుండగా ఓ డీసీఎం వ్యాన్‌, రవి కారును ఢీ కొట్టింది. ఆ సమయంలో కారులో రవితో పాటు డ్రైవర్‌ కూడా ఉన్నాడు.

రవి, డీసీఎం వ్యాన్‌ డ్రైవర్‌ను ప్రశ్నించే ప్రయత్నం చేయగా అతను బాగా తాగి ఉన్నడని తెలిపాడు రవి. వారు తాగి బండి నడుపుతున్నట్టుగా అంగీకరించారని రవి వెల్లడించాడు. అయితే ఈ లోగా రవి పోలీసులకు ఫోన్‌ చేశాడు. పోలీసులు వచ్చే లోపు ఆ డ్రైవర్‌, క్లీనర్‌ డీసీఎంను అక్కడే వదిలేసి పారిపోయారు. అందుకే డ్రైవర్‌తో పాటు ట్రాన్స్‌ఫోర్ట్ కంపెనీ, ఓనర్‌ల మీద కూడా కేసు వేసినట్టుగా రవి వెల్లడించాడు.

ఈ సందర్భంగా పోలీస్‌ డిపార్టెమెంట్‌కు కృతజ్ఞతలు తెలియజేశాడు యాంకర్‌ రవి. సకాలంలో స్పందించటంతో పాటు కేసు నమోదు విషయంలో వాళ్లు వ్యవహరించిన తీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే ప్రమాదం.. తాను కారులో ప్రయాణిస్తుండగా జరిగింది కాబట్టి ప్రాణ నష్టం జరగలేదు. అదే డీసీఎం ఓ టూవీలర్‌ను ఢీ కొట్టినట్టయితే ప్రాణాలే పోయేవి అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ తనిఖీలు మరింత ఎక్కువగా నిర్వహించాలని కోరాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *