సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఎయిర్‌టెల్ వైఫై కాల్ ఆన్

ఎయిర్‌టెల్ వైఫై కాలింగ్  సర్వీస్‌ను దేశరాజధాని న్యూఢిల్లీ లో ఆదివారం లాంచ్ చేసిన  కార్యక్రమం జరిగింది. నెట్ వర్క్‌తో సంబంధం లేకుండా ఎయిర్‌టెల్ వైఫై కాలింగ్ సేవలు పొందొచ్చని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకు వస్తున్నామని.. భారతి ఎయిర్‌టెల్‌ ఏపీ, తెలంగాణ సీఈవో అవనీత్ సింగ్ పూరి చెప్పారు. దీనికి ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని ఆయన అన్నారు. వైఫై సేవలపై కస్టమర్లు ఆసక్తి కనబరుస్తుండటంతో తొలుత తెలుగు రాష్ట్రాల్లోని కస్టమర్లకు దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషిచేశామని భారతి ఎయిర్‌టెల్‌ ఏపీ, తెలంగాణా సీఈవో అన్వీస్‌ సింగ్‌ పూరి వెల్లడించారు. ఐఫోన్ xr, ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్, 7, 7 ప్లస్, ఎస్‌ఈ, ఐఫోన్ 8, 8 ప్లస్, ఐఫోన్ X, ఐఫోన్ XS, ఐఫోన్ XS మ్యాక్స్, ఐఫోన్ 11, 11 ప్రొ, 11 ప్రొ మ్యాక్స్, వన్‌ప్లస్ 7, 7 ప్రొ, 7టి, 7టి ప్రొ, షియోమీ పోకో ఎఫ్1, రెడ్‌మీ కె20, కె20 ప్రొ, శాంసంగ్ గెలాక్సీ జె6, ఆన్6, గెలాక్సీ ఎం30ఎస్, గెలాక్సీ ఎ10ఎస్ ఎయిర్‌టెల్ వైఫై కాలింగ్‌ను వాడుకోవాలంటే వినియోగదారులు తమ తమ ఫోన్లలో ఉండే సెట్టింగ్స్‌లోని మొబైల్ డేటా లేదా మొబైల్ నెట్‌వర్క్స్ ఆప్షన్లలో ఉండే వైఫై కాలింగ్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. దీంతో వైఫై కాలింగ్ ద్వారా చేసుకునే కాల్స్‌లో మాటలు చాలా స్పష్టంగా వినిపిస్తాయి. కాగా ప్రస్తుతం కేవలం ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో మాత్రమే ఈ సేవలు వినియోగదారులకు అందుబాటులో ఉండగా, త్వరలోనే దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు వైఫై కాలింగ్ సేవలను అందుబాటులోకి తేనుంది. ఇదిలా ఉంటే తమ మొబైల్ యాప్‌లో సెక్యూరిటీ ప్రాబ్లమ్ ఉందని ఎయిర్‌టెల్ ఒప్పుకుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *