శిశువుకు రెండు తలలు, మూడు చేతులు ఉన్నాయి

భోపాల్‌ మధ్యప్రదేశ్‌లోని  బాబిత అహిర్వార్‌(21)కు ఏడాదిన్నర క్రితం వివాహమైంది. ఆదివారం రాత్రి అహిర్వార్‌ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ శిశువుకు రెండు తలలు, మూడు చేతులు ఉన్నాయి. రెండు తలలకు కూడా కళ్లు, చెవులు, నోరు ఉన్నాయి. అయితే శిశువు పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. ప్రస్తుతం తల్లి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. డెలివరీ కంటే ముందు చేసిన స్కానింగ్‌లో కవలలు అని డాక్టర్లు నిర్ధారించుకున్నారు. కానీ డెలివరీ తర్వాత రెండు తలల శిశువును చూసి  షాక్‌ అయ్యారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *