నిర్భయ దోషులకు ఉరిశిక్ష

నిర్భయ దోషులకు ఉరిశిక్ష సరైనదని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఇదివరకే ఈ కేసులోని ముగ్గురు దోషులకు సంబంధించిన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇక, ఇవాళ (బుధవారం) మధ్యాహ్నం రెండుగంటలకు పటియాల హౌజ్‌ కోర్టులో నిర్భయ దోషులకు డెత్‌ వారెంట్ల జారీపై విచారణ జరగనుంది. తనకు విధించిన ఉరిశిక్షను పునఃసమీక్షించాలని నిర్భయ కేసులో దోషి అయిన అక్షయ్‌సింగ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అతని అభ్యర్థనపై త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. దోషి అక్షయ్‌ కుమార్‌ సింగ్‌ తనకు విధించిన మరణ శిక్షపై దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తీర్పుపై సమీక్ష కోరే హక్కు దోషికి ఉండబోదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఈ కేసులో సీబీఐ దర్యాప్తు జరపాలని కోరినా  పట్టించుకోలేదని, దర్యాప్తు అధికారుల అసమర్థత వల్ల ఈ కేసులో నిజమైన దోషులను పట్టుకోలేకపోయారని అక్షయ్‌కుమార్‌సింగ్‌ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *