మంత్రి కేటీఆర్. గ్రేటర్‌లో ఫస్ట్ పేజ్ లో 55 స్లిప్ రోడ్లను

హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించి ప్రజలకు సులువైన ప్రయాణం కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. రోడ్లపై ట్రాఫిక్ భారం తగ్గించేలా స్లిప్ రోడ్లను అందుబాటులోకి తేవాలని జీ.హెచ్ యంసి  అధికారులను అదేశించారు. స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్, కాంప్రహెన్సివ్ రోడ్డు మెయింటనెన్స్ ప్రొగ్రామ్ ద్వారా మౌలిక వసతుల కల్పన పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. పాదాచారులకు ఇబ్బందులు కలగకుండా పనులు నిర్వహించాలని అధికారులకు కె.టి ఆర్    సూచించారు.ప్రగతి భవన్లో మేయర్ బోంతు రామ్మోహన్, కమిషనర్ ఇతర ఉన్నతాదికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి కేటీఆర్. గ్రేటర్‌లో ఫస్ట్ పేజ్ లో 55 స్లిప్ రోడ్లను గుర్తించామని, వాటి నిర్మాణానికి వేగంగా ప్రణాళికలు చేస్తున్నామని అధికారులు మంత్రికి తెలియజేశారు. ఇప్పటికే 40 రోడ్లకు సిద్ధమైందన్నారు. ఇందులో 20 రోడ్లలో కేవలం 90 ఆస్తుల సేకరణ పూర్తి చేస్తే సేకరణ పూర్తిచేస్తే స్లిప్‌రోడ్‌ ల నిర్మాణం మొదటిదశ ప్రారంభించేందుకు వీలవుతుందన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *