రష్మి స్టెప్పులకు పెళ్లిలో ఫిదా అయ్యారు
రష్మి జబర్ధస్త్ షోతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అందాల భామ రష్మి గౌతమ్. రీసెంట్గా వైజాగ్లో తన సోదరుడి పెళ్లి వేడుక ఘనంగా జరగగా, ఈ వేడుకలో రష్మి సందడి మాములుగా లేదు. సాంప్రదాయంగా లంగా ఓణీ ధరించి స్టైలిష్ గా ఉన్న రష్మి బారాత్లో తీన్మార్ స్టెప్పులు వేసి అందరు నోరెళ్ళపెట్టేలా చేసింది. తన కుటుంబ సభ్యులతో సైతం డ్యాన్స్ చేయించింది. రష్మి స్టెప్పులని చూసిన చుట్టు పక్కల వారు ఫిదా అయ్యారు.వైజాగ్ లో జరిగిన రష్మి సోదరుడు మలేయ్ త్రిపాఠి వివాహంలో కుటుంబ సభ్యులంతా సాంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ఈ వివాహానికి పలువురు రాజకీయ, వెండితెర, బుల్లి తెరకు చెందిన ప్రముఖులు హాజరు అయ్యారు. ఈ వేడుక కోసం తన పనులన్నీ పక్కన పెట్టి వారం రోజుల ముందే ఇంటికి వెళ్ళిందట రష్మి. ఇక తమ్ముడి పెళ్లి హడావిడిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.