దిశ కేసులో లారీ నడపడం కొరకు ఆధార్ లో

దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులైన నలుగురు వ్యక్తుల్లో ఇద్దరు పాఠశాల జారీ చేసిన బోనాఫైడ్ పత్రాలతో పోల్చితే నిందితులు జొల్లు శివ, చింతకుంట చెన్నకేశవుల వయసు వారి ఆధార్‌ కార్డుల్లో పూర్తి భిన్నంగా ఉంది. వీరిద్దరూ 2012 డిసెంబరు 30న ఆధార్‌ కార్డులు పొందారు. ఆధార్ ప్రకారం.. వీరిద్దరూ 2001లో జన్మించినట్లుగా ఉంది. తేదీలు వేరువేరుగా ఉండడంతో కేసు మరో కొత్త మలుపు తిరిగింది తల్లిదండ్రులు తమ బిడ్డలు మైనర్లని NHRCకి వారి వయసు ధృవీకరణకు సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికెట్లను కూడా సమర్పించినట్లు తెలుస్తోంది. జొల్లు శివ చింతకుంట చెన్నకేశవులు నారాయణ పేట జిల్లా మక్తల్ మండలం గుడిగుండ్లలోని ప్రభుత్వ పాఠశాలలో చదివారు. ఆ పాఠశాలలోని జారీ చేసిన బోనఫైడ్ సర్టిఫికేట్ల ప్రకారం ఎన్ కౌంటర్ జరిగిన రోజు నాటికి జొల్లు శివ వయసు 17 ఏళ్ల 3నెలల 21 రోజులు. చెన్నకేశవుల వయసు 15ఏళ్ల 7నెలల 26 రోజులుగా ఉంది. వీరిలో చెన్నకేశవులు 2014 జూలై నుంచి 2015 ఏప్పిల్ వరకు ఆరో తరగతి చదివాడని బోనఫైడ్ సర్టిపికఎట్లో పేర్కొన్నారు. అతడి పుట్టిన తేదీని 10.04.2004గా పేర్కొన్నారు. చెన్నకేశవులు కిడ్నీ సంబధిత వ్యాదితో బాధపడుతున్నట్లు ఇప్పటికే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దాని చికిత్స నిమిత్త 2018 సెప్టెంబర్ 18నే బోనఫైడ్ సర్టిఫికెట్ తీసుకున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. చెన్నకేశవులకు ఇప్పటికే పెళ్లైంది.అతడి భార్య ప్రస్తుతం గర్భవతి., వీరిద్దరికీ ఓటరు కార్డులు ఇంకా జారీ కాలేదు. తరువాత చధువులు కోలేధు జీవనోపాది కోసం ,లారీ నడపడం కొరకు ఆధార్ లో వయస్సు యెక్కువగా రాపించినట్లు తెలుస్తోంది. కోర్టు ఆదేశాలతో 15 రోజుల్లోగా వయసు నిర్ధారణ పరీక్షలు చేయాల్సి ఉంటుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *