హీరో రాజశేఖర్‌ వింగ్‌ లైసెన్స్‌ను రద్దు

 హీరో రాజశేఖర్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దయింది. రవాణాశాఖ ఆయన డ్రైవింగ్‌ లైసెన్స్‌ను 6 నెలలపాటు రద్దు చేసింది. గతనెల 12న ఔటర్‌ రింగ్‌ రోడ్డు పెద్ద గోల్కొండ వద్ద ఆయన కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఆ సమయంలో రాజశేఖరేకారు నడిపారు.  ఈ కేసులోనే రాజశేఖర్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ను అధికారులు రద్దు చేసినట్లుగా సమాచారం. 2017 అక్టోబర్‌లోనూ పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై ఓ కారును రాజశేఖర్‌ వాహనం ఢీకొట్టిన సంగతి తెలిసిందే. దాని వాలిడిటీ జూన్ 17,2017తో ముగిసింది. ఆ తర్వాత మళ్లీ ఆయన రెన్యువల్‌కి దరఖాస్తు చేసుకోలేదు. ఇదే క్రమంలో ఔటర్ రింగ్ రోడ్డుపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ప్రమాదానికి గురయ్యాడు. దీంతో టోలీచౌకీ ఆర్టీఏ అధికారులు నవంబర్ 29,2019 నుంచి మే 28,2020వరకు రాజశేఖర్ లైసెన్స్ రద్దు చేశారు రాజశేఖర్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కాలపరిమితి 2017 లోనే ముగిసింది. అయినా, ఆయన దాన్ని రెన్యువల్‌ చేసుకోలేదు. దీనికితోడు నిర్లక్ష్యంగా కారు నడుపుతూ వరుసగా ప్రమాదాలకు కారణమవుతుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. .. అప్పటివరకు ఆయన డ్రైవింగ్‌కి దూరంగా ఉండాల్సిందేనని పోలీసులు చెబుతున్నారు. లేనిపక్షంలో ఆయనపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *