10,ఇంటర్ ఓపెన్ స్కూల్ ప్రత్యేక అడ్మిషన్లు
హైదరాబాద్ ; చదువును మధ్యలోనే ఆపేసి, మళ్లీ చదువుకోవాలనే ఆసక్తి కలిగిన వారి కోసం పదో తరగతి, ఇంటర్మీడియట్లో ప్రత్యేక అడ్మిషన్లు కల్పిస్తున్నట్లు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. వీరు జనవరి 18 నుంచి 28లోగా టీఎస్ఆన్లైన్, ఏపీ ఆన్లైన్, మీ సేవా కేంద్రాలలో ఎన్రోల్ చేసుకోవాలని సూచించారు.