కొవిడ్‌-19 వైరస్‌ నిరోధక టీకాకి 18నెలల సమయం…

జెనీవా: కొవిడ్‌-19 వైరస్‌ నిరోధక టీకా అందుబాటులో రావడానికి మరో 18నెలల సమయం పట్టే అవకాశం ఉందని ప్రపంచ అరోగ్య సంస్థ ప్రకటించింది. వైరస్‌కు సంబంధించిన నమూనాలను వివిధ దేశాలతో పంచుకోవడం..టీకాలు, మందుల పరిశోధనలను మరింత వేగవంతం చేయడంకోసం డబ్ల్యూహెచ్‌ఓ రెండు రోజుల పాటు జెనీవాలో సమావేశమయ్యింది.

చైనాతోపాటు ప్రపంచంలో పలు దేశాలకు వ్యాపిస్తున్న   కరోనా వైరస్‌ బారిన పడకుండా ముందు జాగ్రత్త కోసం చైనాతోపాటు కొన్ని దేశాల ప్రజలు ముఖానికి మాస్క్‌లు ధరిస్తున్నారు. దాంతో ఒక్కసారిగా ఈ మాస్క్‌లకు డిమాండ్‌ పెరగడంతో ‘ఆమెజాన్‌ ఆన్‌లైన్‌’ మార్కెట్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా నిల్వ ఉన్న స్టాక్‌లో ఎక్కువ భాగం ఇప్పటికే అమ్ముడు పోయింది. ప్రపంచానికి మాస్క్‌ల సరఫరా చేస్తున్న నెంబర్‌ వన్‌ దేశం చైనానే కావడం, అక్కడే కరోనా వైరస్‌ వెలుగులోకి రావడంతో ఉత్పత్తులు భారీగా పడిపోయాయి. సరఫరాలు నిలిచిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్న మాస్క్‌లలో సగం వాటా చైనాదే కావడం గమనార్హం.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *