2.0….లేడీ రోబోగా అమీ జాక్సన్ ఫస్ట్ లుక్ అదుర్స్!

రజనీకాంత్ హీరో భారీ చిత్రాల దర్శకుడు శంకర్ ప్రస్తుతం ‘2.0’ అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో రజనీ-శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘రోబో’ చిత్రానికి ఇది సీక్వెల్ తరహాలో ఉంటుంది. అప్పట్లో వచ్చిన రోబో సినిమాలో కేవలం మగ రోబో మాత్రమే ఉంది. అయితే ఈ సీక్వెల్‌లో ఆడ రోబో కూడా అభిమానులను అలరించబోతోంది.

ఈ చిత్రంలో ఆడ రోబోగా అమీ జాక్సన్ నటిస్తోంది. తాజాగా ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ చిత్ర యూనిట్ బుధవారం రిలీజ్ చేసింది. ఈ ప్రపంచం కేవలం మనుషులది మాత్రమే కాదు… అనే క్యాప్షన్‌తో ఈ పోస్టర్ ఉండటం గమనార్హం.

2.0 సినిమాకు సంబంధించిన పాటల చిత్రీకరణ ఈ రోజు ప్రారంభం అయింది అంటూ…. దర్శకుడు శంకర్ తన సోషల్ మీడియాలో అమీ జాక్సన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. దీన్ని బట్టి సినిమాలో రజనీ రోబో, అమీ జాక్సన్ రోబో క్యారెక్టర్ల మధ్య రొమాంటిక్ సీన్లు ఉంటాయని తెలుస్తోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *