బర్త్‌డే పేరుతో ఇంటికి పిలిచి 23 మంది చిన్నారులను

లక్నో: బర్త్‌డే పేరుతో ఇంటికి పిలిచి 23 మంది చిన్నారులను చెరబట్టిన ఉత్తర ప్రదేశ్ ఉన్మాది భార్యను స్థానికలు కొట్టి చంపారు. గ్రామస్తుల దాడిలో తీవ్రంగా గాయపడిన  ఆమె ఇవాళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. వాస్తవానికి ఆస్పత్రిలో్ చేర్చిన సమయంలోనే ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. కాగా పోస్టుమార్టం నివేదిక అందిన తర్వాతే ఆమె మృతికి గల కారణాలు చెప్పగలమని కాన్పూర్ రేంజ్ ఐజీ మోహిత్ అగర్వాల్ పేర్కొన్నారు.  ఫరూకాబాద్‌లో జైలు నుంచి బయటికి వచ్చిన ఓ నేరగాడు.. తమ కుమార్తె బర్త్‌డే వేడుకలకు రమ్మని ఆహ్వానించి 23 మంది చిన్నారులను బందీలుగా చేసుకున్న సంగతి తెలిసిందే. తొమ్మిది గంటల ఆపరేషన్ అనంతరం ఎట్టకేలకు పోలీసులు నిందితుడు సుభాష్ బాతంను ఎన్‌కౌంటర్ చేసి పిల్లలను విడిపించారు.గురువారం సాయంత్రం తన కుమార్తె గౌరి పుట్టిన రోజని, ఇంట్లో దావత్ ఇస్తున్నానని చెప్పి చుట్టుపక్కల ఉన్న పిల్లలను పిలిచాడు. దాదాపు 20 మంది పిల్లలు ఇంట్లోకి రాగానే తలుపులు మూసేశాడు. పొరుగింటికి చెందిన బబ్లి అనే మహిళ తన కుమార్తెను తీసుకెళ్లేందుకు వచ్చి, తలుపు తెరువాలని కోరగా సుభాష్ నిరాకరించాడు. పైగా ఆమెను తిట్టడం మొదలుపెట్టాడు. దీంతో బబ్లి తన ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులకు విషయం చెప్పింది. స్థానికులు వెళ్లి ఇంటి తలుపులు విరగ్గొట్టేందుకు ప్రయత్నించగా సుభాష్ తుపాకితో వారిపైకి కాల్పులు జరిపాడు. వారు పోలీసులకు సమాచారం అందించగా.. ఇన్‌స్పెక్టర్ రాకేశ్ కుమార్ నేతృత్వంలో వందమందికిపైగా పోలీసులు కర్తియా గ్రామానికి చేరుకున్నారు. తలుపులు తెరువాలని పోలీసులు ఆదేశించగానే.. సుభాష్ మరోసారి కాల్పులు ప్రారంభించాడు. తనను అనవసరంగా హత్యానేరంలో ఇరికించారంటూ అరిచాడు. తర్వాత తన ఇంటి కిటికీ నుంచి ఒక గ్రనేడ్‌ను బయటికి విసిరాడు. అది పేలడంతో ఇన్‌స్పెక్టర్ చేతులకు, మరో పోలీస్ అధికారి దేవన్ జయవీర్ కాలికి గాయాలు కావడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. స్థానిక ఎమ్మెల్యే నాగేంద్ర సింగ్ ఘటనాస్థలానికి చేరుకొని, మైక్ సాయంతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. వెంటనే సుభాష్ కాల్పులు జరపడంతో ఎమ్మెల్యే వెనక్కి తగ్గారు. కాల్పుల్లో అనుపమ్ దూబే అనే స్థానికుడికి బుల్లెట్ గాయం కావడంతో పోలీసులు అతడిని దవాఖానకు తరలించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *