50 మంది విద్యార్థులపై పిచ్చికుక్కలు దాడి చేశాయి

మహానగరం నడిబొడ్డున ఉన్న అమీర్‌పేట ప్రాంతంలో ఓ పిచ్చి కుక్క మంగళవారం స్వైర విహారం చేసింది. 50 మంది విద్యార్థులతో పాటు పలువురిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. గాయపడ్డ విదార్థులతో పాటు మరో పదకొండు మంది బాధితులకు నగరంలోని పలు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. సీఎం ఆఫీస్‌ ఎదురుగా బీఎస్‌ మక్తా, ధరమ్‌ కరమ్‌ రోడ్డు, చిన్మయి స్కూల్‌, చెల్లా నర్సింగ్‌ హౌమ్‌, అమీర్‌పేట సత్యం థియేటర్‌ ప్రాంతాల్లో ఇదే కుక్క రోడ్డుపై దాదాపు 61మందిపై దాడిచేసి తీవ్రంగా గాయపర్చినట్టు తెలిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి అమీర్‌పేట ధరమ్‌కరమ్‌ రోడ్డు నుంచి సత్యం థియేటర్‌ వరకూ దాదాపు 3 గంటల పాటు స్థానిక విద్యార్థులు, యువకులను ఆ కుక్క ముప్పు తిప్పలు పెట్టించినట్టు తెలిసింది. అమీర్‌పేటలో మంగళవారం (జనవరి 21) సాయంత్రం ప్రభుత్వ పాఠశాల నుంచి వస్తున్నవిద్యార్థులపై పిచ్చికుక్కలు దాడి చేశాయి. ధరమ్‌కరమ్‌ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనతో ఆగ్రహం చెందిన స్థానికులు పిచ్చి కుక్కలను వెంబడించి ఓ కుక్కను చంపేశారు. చిన్నారులపైకి కుక్కలు ఒక్కసారిగా దూసుకురావడంతో వారంతా ఒకరిపై ఒకరు పడిపోయారు. దీంతో కుక్కలు వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. బాధిత విద్యార్థులను నల్లకుంటలోని ఫీవర్‌ ఆస్పత్రితో పాటు నగరంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీధి కుక్క దాడిలో గాయపడిన బాధితులు చెల్లానర్సింగ్‌ హౌంలో 18 మంది, వెల్‌నెస్‌ ఆసుపత్రిలో 4గురు, అమీర్‌పేట ప్రభుత్వ అర్భన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌లో 7గురు, నారాయణ గూడ ఐపీఎంలో 5 గురు, ఇండస్‌ సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఏడుగురు, భాస్కర్‌ ఆస్పత్రిలో ఇరవై మంది చికిత్స పొందుతున్నట్టు జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్‌ సర్కిల్‌ వెటర్నరీ అధికారి జేజియా నాయక్‌ తెలిపారు. గాయపడిన వారంతా రెబీస్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారని ఆయన తెలిపారు.
వీధి కుక్కలపై అధికారులకు ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేశామని.. అయినా చర్యలు తీసుకోలేదని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వీధుల్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని.. పిల్లలు, మహిళలు ఆరుబయటకు రావాలంటేనే భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *