రోజూ గుప్పెడు పిస్తా ప‌ప్పు తింటే..?

మన శరీరానికి పోషకాలను అందించేందుకు ఎన్నో రకాల ఆహార పదార్థాలు మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ‘నట్స్’ ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇక‌ అదే జాతికి చెందిన ‘పిస్తా పప్పు’లను తరచూ తీసుకోవడం, వాటిని మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. వాటితో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. శ‌రీరానికి చ‌క్క‌ని పోష‌ణ అందుతుంది. ఈ క్రమంలోనే రోజూ ఒక గుప్పెడు పిస్తా ప‌ప్పు తింటే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. క్యాన్సర్‌లు రాకుండా కాపాడడంలో పిస్తా పప్పు అద్భుతంగా పనిచేస్తుందని తాజాగా చేసిన పరిశోధనల్లో తెలిసింది. అందువ‌ల్ల పిస్తా ప‌ప్పును రోజూ తింటే క్యాన్స‌ర్ రాకుండా చూసుకోవ‌చ్చు.

2. పిస్తా పప్పులలో బాదం పప్పు కన్నా అధికంగా పోషక పదార్థాలు ఉంటాయి. వీటిలో పొటాషియం అధికంగా ఉండడం వల్ల శరీరంలో ద్రవాల నియంత్రణకు బాగా పనిచేస్తాయి. విటమిన్ బి6 కూడా వీటిలో ఎక్కువగానే ఉంటుంది. దీని వల్ల శరీరం ప్రోటీన్లను ఎక్కువగా గ్రహిస్తుంది. డ్రై ఫ్రూట్స్ అన్నింటితో పోలిస్తే ఈ పప్పులలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి.

3. గుండె జబ్బులను తగ్గించే గుణం వీటిలో ఉంది. యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్స్, ఫైబర్, విటమిన్ ఇలు ఎక్కువగా ఉంటాయి.

4. రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. తక్కువ తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీంతో బరువు తగ్గేందుకు ఇది ఉపయోగపడుతుంది. కేవలం 30 గ్రాముల పిస్తా పప్పు తింటేనే శరీరానికి దాదాపు 160 క్యాలరీల శక్తి తక్షణమే అందుతుంది.

5. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. జీర్ణశక్తిని మెరుగు పరుస్తాయి. కంటికి సంబంధించిన సమస్యలు దూరమవుతాయి. తరచూ తీసుకోవడం వల్ల కంటికి చాలా మంచిది. చూపు స్పష్టంగా ఉండటానికి వీటి లోని పోషకాలు దోహదం చేస్తాయి. శరీరానికి హాని కలిగించే కొవ్వు పదార్థాలు వీటిలో ఉండవు.

6. శరీరంలో విడుదలైన వ్యర్థాలను దూరం చేస్తాయి. ఈ పప్పులోని విటమిన్ ‘ఇ’ చర్మం మృదువుగా ఉండటానికి తోడ్పడుతుంది. చర్మం మీది మృతకణాలను తొలగిస్తుంది. పిస్తా పప్పును తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా మారుతుంది. కణాలు దెబ్బ తినకుండా ఉంటాయి.

7. అన్ని శరీర భాగాలకూ రక్తం సక్రమంగా అందుతుంది. రోజూ కొన్ని పిస్తా పప్పులు తినడం వల్ల శరీరంలో చెడు కొవ్వు నిల్వలు దూరమవు తాయి. రక్తపోటు సమస్యలు బాధించవు. నరాల్లో రక్తం కూడా గడ్డ కట్టదు.

8. పిస్తాలో ఉండే పీచు అరుగుదల బాగుండేలా చేస్తుంది. ఫాస్పరస్ అధికంగా ఉండే వాటిల్లో పిస్తా ఒకటి. ఈ పప్పు శరీరానికి ప్రొటీన్‌, అమినో ఆమ్లాలను అందిస్తుంది. మధుమేహం ఉన్నవారికి పిస్తా చాలా మేలు చేస్తుంది. ఇన్సులిన్ శాతాన్ని పెంచడంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *