9 లక్షల అనుమానాస్పద ఖాతాలు?

పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో.. దేశ వ్యాప్తంగా వివిధ బ్యాంకు ఖాతాల్లోజమ అయిన మొత్తానికి సంబంధించిన ఆశ్చర్యకరమైన విషయం ఒకటి బయటకు వచ్చింది. మోడీ తీసుకున్న సంచలన నిర్ణయం అనంతరం.. లక్షలాది ఖాతాల్లోకి నల్లధనం భారీగా వచ్చి చేరిందన్న సందేహాన్ని ఐటీ శాఖ వ్యక్తం చేస్తోంది. అనుమానాస్పదంగా లావాదేవీలు జరిపిన ఖాతాలపై కన్నేసిన ఐటీ శాఖ తన ‘ఆపరేషన్ క్లీన్ మనీ’ ప్రోగ్రాంలో భాగంగా రూ.5లక్షలకు మించి జమ చేసిన వారి వివరాల్ని సేకరించింది.

పెద్ద ఎత్తున మొత్తాన్ని ఎలా జమ చేశారు? ఇందుకు సంబంధించిన నిధులు ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయాన్ని తెలపాలంటూ నోటీసులు జారీ చేసింది. పెద్దనోట్ల రద్దు అనంతరం.. రూ.5లక్షలకు మించిన మొత్తాన్ని డిపాజిట్ చేసిన 18లక్షల మందికి ఈ మొయిళ్లు.. ఎస్ ఎంఎస్ ల ద్వారా ప్రశ్నల్ని పంపింది. వీటికి ఫిబ్రవరి 15లోపు సమాధానాలు ఇవ్వాలని కోరింది.

ఇలా కోరిన వారి నుంచి వచ్చిన స్పందనను చూసిన ఐటీ శాఖ.. 9లక్షల మంది ఖాతాలు అనుమానాస్పదంగా ఉన్నట్లుగా గుర్తించారు. వీరు ఐటీశాఖ పంపిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదు. అవగాహన ఇవ్వలేదా? లేక.. త్వరలో తాము సబ్ మిట్ చేసే ఐటీ రిట్నర్స్ లో వెల్లడిద్దామని ఊరుకున్నారా? లాంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

రిటర్న్స్ లో లెక్కలు చూపిస్తేనే ఆదాయం అధికారికం కాదని.. సంతృప్తికరమైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. రిటర్న్స్ లో ఆదాయాన్నిభారీగా పెరిగినట్లుగా చూపిస్తే.. చట్టబద్ధం కాదన్న విషయాన్ని ఐటీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఒక్కసారిగా ఆదాయం భారీగా పెరిగినట్లు చూపిస్తే.. దాన్ని లెక్కలో చూపని ఆదాయంగానే పరిగణిస్తామని ఐటీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. నల్లధనానికి సంబంధించి ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద చట్టబద్ధం కాని సొమ్ము లెక్కల్ని చూపించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ పథకం తుది గడువు (మార్చి 31) ముగిసే వరకూ వెయిట్ చేసి.. ఆ తర్వాత చర్యలు షురూ చేయనున్నట్లుగా చెబుతున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *