బస్ లో గొడుగు…ఎందుకంటే…

మీరు ఎప్పుడైనా బస్సులో గొడుగు వేసుకున్నారా?…బస్సులో గొడుగెంటి అనుకుంటున్నారా…అలాంటి సంఘటనే ఒకటి ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే యూ‌పి‌ఎస్‌ఆర్‌టి‌సి (UPSRTC) చెందిన బస్ లో ఒక ప్రయాణీకుడు గొడుగు వేసుకొని కూర్చోన్నాడు. దానికి కారణం ఆ బస్సు పై కప్పు కారడమే. వర్షపు నీరు పై నుండి కారుతుండడంతో బస్ లో గొడుగు వేసుకున్నాడు. దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇప్పుడిది వైరాలగా మారింది. దీనితో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ బస్ సర్వీస్ అంబేడ్కర్ నుండి అజంగర్ వరకు నడుస్తుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *