ఓ ఆకతాయిపై యువతి యాసిడ్‌ దాడి చేసింది

లక్నో : ప్రేమిస్తున్నానని వేధింపులకు గురి చేస్తున్న ఓ ఆకతాయిపై యువతి యాసిడ్‌ దాడి చేసింది. ఈ ఘటన యూపీలోని ఉన్నావ్‌ జిల్లాలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. మోర్వాన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని గోదామౌ గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువకుడు రోహిత్‌ యాదవ్‌.. స్థానికంగా ఉన్న డైరీఫామ్‌లో క్లీనర్‌గా పని చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతిని ప్రేమిస్తున్నానని అతను ఆమె వెంట పడుతున్నాడు. రోహిత్‌ ప్రేమను యువతి అంగీకరించలేదు. రోజురోజుకు రోహిత్‌ వేధింపులు అధికమవడంతో.. అతనికి బుద్ధి చెప్పాలని యువతి నిర్ణయించుకుంది. దీంతో మంగళవారం ఉదయం రోహిత్‌ పని చేస్తున్న డైరీఫామ్‌ వద్దకు యువతి చేరుకుంది. రోహిత్‌ అక్కడికి రాగానే అతనిపై ఆమె యాసిడ్‌ దాడి చేసింది. యాసిడ్‌ దాడిలో తీవ్రంగా గాయపడ్డ యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *