అంతరిక్షంలో అడుగుపెడుతున్న ఆమిర్ ఖాన్

సాధారణంగా ఆమిర్ ఖాన్ ఒక సినిమా తర్వాత మరొకటి చొప్పున చేస్తూ ఉంటాడు. ఒకటి ఫినిష్ అయ్యే టైమ్ కి రెండో మూవీకి రంగం సిద్ధం చేయడం.. మేకోవర్ లాంటివి చేయడం అన్నీ అయ్యి.. ఆ సినిమా పూర్తయి రిలీజ్ అయ్యే టైమ్ ఏడాదికి పైగా టైమ్ పట్టేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు దంగల్ రిలీజ్ కి రెడీ అయ్యే టైమ్ కే.. ఆమిర్ ఖాన్ మూడు సినిమాలు లైన్ లో పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

తన మేనేజర్ అద్వైత్ చౌహాన్ మూవీ సీక్రెట్ సూపర్ స్టార్ లో ఈ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఓ కేమియో చేయనున్నాడట. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసేశాడని కూడా టాక్. మరోవైపు యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ మూవీకి ఆమిర్ ఖాన్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ తో కలిసి మొదటిసారి నటిస్తున్నాడు ఈ మిస్టర్ పర్ఫెక్ట్. ఇది 2018 దీపావళికి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేశారు.

దీంతోపాటే ఆస్ట్రోనాట్ రాకేష్ శర్మ బయోపిక్ లో కూడా నటించేందుకు అంగీకరించాడు ఆమిర్. ఆస్ట్రోనాట్ జీవితమే అయినా.. దేశభక్తి కాన్సెప్ట్ ఉట్టిపడేలా టైటిల్ ఉండాలని భావించారట నిర్మాతలు. అందుకే సెల్యూట్.. సారే జహాసే అచ్ఛా అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వీటిలో సారే జహాసే అచ్ఛా అయితేనే.. యాప్ట్ టైటిల్ అని భావిస్తున్నట్లు చెబుతున్నారు. భారతదేశం నుండి అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ.. అంతరిక్షం నుంచి ఇండియా ఎలా ఉంది అంటే.. సారే జహాసే అచ్ఛా అని రాకేష్ చెప్పారు. ఇప్పుడదే ఆమిర్ ఖాన్ మూవీ టైటిల్ కానుందన్న మాట.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *