నెక్ట్స్‌ ఏంటీ..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి కోసం ఆయన అభిమానులు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నారు. బాహుబలి-2 విడుదల తర్వాత ప్రభాస్‌ పెళ్లి పీటలు ఎక్కడబోతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు కూడా అప్పట్లోనే ఖరారు చేశారు. బాహుబలి-2 విడుదల తర్వాత ప్రభాస్ సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా మొదలవ్వడానికి ముందే ప్రభాస్ పెళ్లి జరుగుతుందని ఆయన తెలిపారు. తాజాగా బాహుబలి2 ట్రైలర్ విడుదలైంది. దీంతో ప్రభాస్ పెళ్లి విషయం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది.

ఇక కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్న తర్వాత ప్రభాస్ పెళ్లెప్పుడనే ప్రశ్న కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్ పెళ్లి మాత్రమేనా.. రానా పెళ్లి కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. టాలీవుడ్‌లో మోస్ట్ అవైటెడ్ బ్యాచిలర్ హీరోలైన వీళ్లిద్దరూ పెళ్లి గురించి అడిగిన ప్రతీసారి బాహుబలి2 పూర్తయిన తర్వాతని చెప్పుకొచ్చారు.

ఈ ట్రైలర్ లాంచ్ వేడుకలో పాల్గొన్న ప్రభాస్‌‌ను, రానాను పెళ్లి గురించి ఓ మీడియా ప్రతినిధి అడిగ్గా… వీళ్లిద్దరూ తెలివిగా తమ సమాధానాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు. పెద్దోళ్లు ఫస్ట్ వీటి గురించి మాట్లాడాలంటూ రానా మైక్‌ను ప్రభాస్‌కిచ్చే ప్రయత్నం చేయగా… ఈ సినిమాలో నువ్వే పెద్దోడివంటూ రానా చేతికి తిరిగి మైకిచ్చాడు ప్రభాస్‌. మైకందుకున్న రానా ఈ సినిమా చూసిన తర్వాత ఎవరూ గ్యారెంటీగా పిల్లనివ్వరంటూ చమత్కరించాడు. మళ్లీ వెతకడం, మళ్లీ మొదటి నుంచి స్టార్ట్ చేస్తానని చెప్పాడు. ప్రభాస్ మాత్రం ఇంకా ఆ విషయం తనకు తెలియదంటూ సమాధానాన్ని దాటవేశాడు. ఇక బాహుబలి ‘బిగినింగ్‌’ను ‘కన్‌క్లూజన్‌’ మరిపిస్తుందో లేదో తెలియాలంటే ఏప్రిల్‌ 28 వరకూ ఆగాల్సిందే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *