నటుడు ప్రదీప్ ఆత్మహత్యకు అసలు కారణం ఇదే…

భార్య పావనీరెడ్డితో స్వల్ప గొడవకు దిగి.. మద్యం మత్తులో క్షణికావేశానికిలోనై టీవీ నటుడు ప్రదీప్‌ కుమార్‌ (26) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు ప్రదీప్‌ భార్య పావనీరెడ్డి, అతని స్నేహితుడు శ్రవణ్‌ను గురువారం పోలీసులు విచారించారు. శ్రవణ్‌ పుట్టినరోజు వేడుకలో మద్యం సేవించిన తర్వాత పావనీ రెడ్డి, ప్రదీప్‌ మధ్య స్వల్ప గొడవ జరిగినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. దీంతో కోపోద్రిక్తుడైన ప్రదీప్‌ కుమార్‌ ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. గతంలోనూ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగాయన్నారు. కాగా ప్రదీప్‌ పోస్టుమార్టం రిపోర్టును అధికారికంగా వెల్లడించకున్నా.. ఆ రిపోర్టులో వైద్యులు ఆత్మహత్యగా పేర్కొన్నట్లు తెలిసింది. ఘటన జరిగిన రోజే పావనీ రెడ్డి, శ్రవణ్‌ సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులకు హత్యగా అనుమానించడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదు. కాగా ప్రదీప్‌ అంత్యక్రియలు రాయదుర్గంలోని మహాప్రస్థానంలో గురువారం జరిగాయి. బుల్లితెర నటులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రదీ్‌పతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకొని కన్నీరుమున్నీరయ్యారు.
ఆత్మహత్యకు ముందు ఇదీ జరిగింది..!
శ్రవణ్‌ పుట్టిన రోజు వేడుక ముగిసిన తర్వాత స్నేహితులందరూ అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఫ్లాట్‌నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య స్పల్ప గొడవ జరిగింది. ‘‘నన్ను నువ్వు అంతగా పట్టించుకోవడం లేదు’’ అంటూ భార్య పావని వద్ద ప్రదీప్‌ వాపోయాడు. శాంతించిన ప్రదీప్‌ దగ్గరికి తీసుకుందామని ప్రయత్నించగా.. ఆమె బాతరూంలోకి వెళ్లి గడియ పెట్టుకుని ఏడ్చింది. ప్రదీప్‌ రెండుసార్లు తలుపు తట్టినా తీయలేదు. అప్పటికే వేడుకలో మద్యం సేవించిన ప్రదీప్‌.. ఆవేశంతో పక్కనే ఉన్న అద్దాన్ని పగుల గొట్టాడు. చేతికి గాయమై రక్తస్రావం అవుతుండటంతో బయటకు వచ్చిన పావని.. అతని చేతికి కట్టుకట్టింది. ఉదయం షూటింగ్‌కు వెళ్లాలని చెప్పిన ప్రదీప్‌.. బెడ్‌రూంలోకి వెళ్లి గడియపెట్టుకున్నాడు.
ఉదయం షూటింగ్‌కు సమయవుతోందంటూ భార్య తలుపు తట్టగా తీయలేదు. అనుమానంతో తలుపులు పగులగొట్టగా చీరతో ఫ్యానకు ఉరేసుకున్న ప్రదీప్‌ కనిపించాడు. విశాఖపట్నానికి చెందిన శ్రవణ్‌, ప్రదీప్‌ మంచి స్నేహితులు. ఖతర్‌ నుంచి శ్రవణ్‌ నాలుగు నెలల క్రితమే హైదరాబాద్‌కు వచ్చాడు. వారి అపార్ట్‌మెంట్‌లోనే ఉంటున్నాడు. ప్రదీప్‌, పావనీ రెడ్డి ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లడంలో అతడే ముఖ్యపాత్ర పోషించాడు. దగ్గరుండి పెళ్లి జరిపించాడు. శ్రవణ్‌ మీద అభిమానంతోనే పావనీరెడ్డి తన ఫోనలో ప్రొఫైల్‌ పిక్‌గా అతడితో కలిసి ఉన్న చిత్రాన్ని పెట్టినట్లు ఓ పోలీసు అధికారి చెప్పారు. ప్రదీప్‌ కుటుంబ సభ్యులు కూడా శ్రవణ్‌ను అనుమానించడం లేదు
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *