నటి షబానా ఆజ్మీ రోడ్డు ప్రమాదంలో

ముంబై: ఇవాళ జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో బాలీవుడ్ సీనియర్ నటి షబానా ఆజ్మీ తీవ్రంగా గాయపడ్డారు. ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్ హైవేపై శనివారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఖలాపూర్ టోల్ ప్లాజా వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ఓ లారీ కిందికి దూసుకెళ్లినట్టు చెబుతున్నారు. ప్రమాదం ధాటికి కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన షబానాను పన్వేల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. ప్రమాద సమయాంలో ఆమె భర్త జావేద్ అక్తర్ కూడా ఆమెతో పాటే ఉన్నట్టు సమాచారం. గత రాత్రే షబానా తన భర్త, ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ 75వ జన్మదినాన్ని ముంబైలో జరిపారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *