రైటర్స్ కోసం ఉపాసన

ఉపాసన కొణిదెల.. మెగాస్టార్ చిరంజీవి కోడలిగా.. రామ్ చరణ్ భార్యగా మెగా ఫ్యామిలీతో మమేకైపోయింది. అంతేకాదు అపోలో హెల్త్ కేర్ బాధ్యతలు నిర్వహిస్తూ తనదైన శైలిలో సెలబ్రిటీల డైట్స్ గురించి ఇంటర్వ్యూలు చేయడమే కాదు… తనకు హెల్త్ విషయంలో తెలిసిన చిట్కాలను సోషల్ మీడియా ద్వారా మాములు ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. అంతేనా.. రామ్ చరణ్, చిరంజీవికి సంబందించిన ఏ అప్‌డేట్ అయినా.. ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మెగాభిమానులకు మెగా ఫ్యామిలీకి మధ్య వారధిలా నిలుస్తోంది. తాజాగా ఈమె .. తన కంపెనీలో పనిచేసేందకు కంటెంట్ రైటర్స్ కావాలని ప్రకటన ఇచ్చింది. అంతేకాదు ఎడిటర్స్ కావాలని కూడా చెప్పింది. అంతేకాదు గతంలో హెల్త్ ఇష్యూస్‌కు సంబంధించిన ఏమైనా ఆర్టికల్స్ ఉండే తమ బయోడేటాతో పాటు అభిరుచులను హాబీలను  పంపించమని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *