దీంట్లో చిరంజీవి తర్వాత ఎన్టీఆరే!

ఎంత పెద్ద స్టార్‌కి అయినా కానీ మీడియాతో ఎలా మసలుకోవాలనేది తెలిసి వుండాలి. ఒక స్టార్‌ని నిత్యం వార్తల్లో వుంచడమే కాకుండా, వారిని ‘గుడ్‌ న్యూస్‌’లో వుంచేది మీడియానే. ఏ హీరో గురించి అయినా తరచుగా నెగెటివ్‌ వార్తలు, గాసిప్పులు వస్తుంటే వారి మీద తెలియకుండానే జనాల్లో బ్యాడ్‌ ఇంప్రెషన్‌ పడుతుంది.

అలాగే మీడియాతో సరిగ్గా ఇంటరాక్ట్‌ కాకపోయినా వారి గురించి రాయడానికి ఏమీ వుండదు కనుక ఆ విధంగాను జనాలకి మరింత దగ్గర కాలేరు. మీడియాతో ఇంటరాక్ట్‌ అయ్యే విషయంలో చిరంజీవి రూటే సెపరేటు. తన తరం హీరోల్లో చిరంజీవి మాదిరిగా మీడియాతో కలిసిపోయి తమ వాడు అనిపించేలా మసలుకున్న హీరో ఇంకొకరు లేరు.

తన తర్వాతి తరంలో ఈ పద్ధతి ఎన్టీఆర్‌లో ఎక్కువ కనిపిస్తోందని మీడియా వాళ్లే అంటున్నారు. ఎలాంటి ప్రశ్న అడిగినా దాటవేయకుండా సమాధానం చెప్పడం, మీడియా వాళ్లని కూడా సొంత మనుషుల్లా ట్రీట్‌ చేయడం ఎన్టీఆర్‌ ప్రత్యేకత. మహేష్‌, పవన్‌ మరీ రిజర్వుడుగా వ్యవహరిస్తూ వుంటే, చరణ్‌, ప్రభాస్‌ తదితరులు అంత త్వరగా మీడియా ముందుకి రారు.

మరికొందరు హీరోలు మీడియా ముందు స్టయిల్‌ కొట్టి, వాళ్ల మీదే సెటైర్లు వేసి నెగెటివ్‌ న్యూస్‌లో వుంటుంటారు. ఎన్టీఆర్‌ని చూసి అయినా మీడియా వాళ్లతో ఎలాగుండాలనేది మిగతా వాళ్లు తెలుసుకుంటే మంచిదని మీడియా సభ్యులు వ్యాఖ్యానిస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *