ఫస్ట్ డే కలక్షన్స్: అజ్ఞాతవాసి ‘రికార్డులవాసి’

పవన్ కళ్యాణ్ క్రేజ్ అనండి.. ఎక్కువ స్ర్కీన్లలో రిలీజ్ అయ్యిందని చెప్పండి.. లేదంటే టిక్కెట్ రేట్లను పెంచారనే అనుకోండి.. కాని ఫ్లాప్ టాక్ తో కూడా ఒక సినిమాను రికార్డుల బాటలో ప్రయాణింపజేశాడు ఈ పవర్ఫుల్ హీరో. ఇప్పుడు ”అజ్ఞాతవాసి” తొలిరోజు కలక్షన్లను చూస్తే ఆ విషయంపై పక్కా క్లారిటీ వచ్చేస్తోంది. అసలు తొలిరోజు ఈ సినిమా ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి.

ఆల్రెడీ అమెరికాలో ప్రీమియర్ వసూళ్ళతో క్రియేట్ చేసిన రికార్డులు చాలవన్నట్లు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కలక్షన్లతో అజ్ఞాతవాసి ఇరగదీశాడు. ఏకంగా 26 కోట్ల షేర్ ను వసూలు చేసి.. తొలిరోజు నాన్ బాహుబలి 2 రికార్డ్ క్రియేట్ చేశాడు. మొత్తంగా ‘అజ్ఞాతవాసి’ ప్రపంచవ్యాప్తంగా తొలిరోజున 39+ కోట్ల షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 26.3+ కోట్లు షేర్ వసూలు చేసిన ఈ సినిమా.. అమెరికాలో 5.94 కోట్ల షేర్.. కర్ణాటకలో 5.1+ కోట్ల షేర్ వసూలు చేసి.. తక్కిన లొకేషన్లలో మరో 1.7+ కోట్లు కలక్ట్ చేసి.. మొత్తంగా తొలిరోజున 39+ కోట్ల షేర్ రిజిస్టర్ చేసింది. అంటే దాదాపుగా 60+ కోట్లు గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది.

ఇక రికార్డుల విషయానికొస్తే.. తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి 2 తరువాత అత్యధిక వసూళ్ళు ఇవే. అలాగే సౌత్ ఇండియాలో చూసుకుంటే.. బాహుబలి 2.. కబాలి అండ్ బాహుబలి తరువాత ఇదే హైయెస్ట్ కలక్షన్. కాకపోతే విషయం ఏంటంటే.. అజ్ఞాతవాసి దాదాపుగా 125 కోట్లను వసూలు చేస్తేనే సినిమా పంపిణీదారులు అందరూ సేఫ్ అవుతారు. అది సంగతి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *