అజిత్‌కు షూటింగ్‌లో గాయాల‌య్యాయి

తమిళ అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రైన అజిత్‌కు షూటింగ్‌లో గాయాల‌య్యాయి. వివ‌రాల్లోకెళ్తే అజిత్ హీరోగా ఖాకి ద‌ర్శ‌కుడు హెచ్‌.వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో ‘వ‌లిమై’  అనే సినిమాలో న‌టిస్తున్నాడు. బాలీవుడ్ నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అజిత్‌కి డూప్ చేత స్టంట్స్ చేయించుకోవడం నచ్చదట ఎంత రిస్కీ స్టంట్ అయినా కూడా ఆయనే చేసేస్తారు. సోమ‌వారం రోజున ఓ బైక్ ఛేజింగ్ సీన్‌ను చిత్రీక‌రిస్తున్న‌ప్పుడు బైక్ స్కిడ్ అయ్యింది. అజిత్‌కు చిన్న‌పాటి దెబ్బ‌లు త‌గిలాయ‌ట‌. ఇర‌వై నిమిషాల పాటు రెస్ట్ తీసుకుని ఆ సీన్‌ను అజిత్ కంప్లీట్ చేసేసి హాస్పిట‌ల్‌కు వెళ్లాడ‌ట‌. డాక్ట‌ర్స్ కొన్ని రోజుల పాటు రెస్ట్ సూచించార‌ట‌. త‌దుప‌రి ఈ సినిమా షెడ్యూల్ హైద‌రాబాద్‌లో ప్రారంభం కానుంది. ‘పింక్’ త‌మిళ రీమేక్ ’నేర్కొండ పార్వ్యై’ త‌ర్వాత అజిత్‌, బోనీక‌పూర్‌, వినోద్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్ర‌మిది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *