థ్యాంక్ యు వదినా..

అఖిల్ చేసింది ఒక్క సినిమానే అయినప్పటికి ఆయనకి ఫాలోయింగ్ ఎక్కెవే. ముఖ్యంగా సోషల్ మీడియాలో అఖిల్ ని ఫాలో అయ్యే ఫాలోవర్స్ భారీగానే ఉన్నారు .తాజాగా ఈ అక్కినేని కుర్రాడు ట్విట్టర్లో 1 మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. ఈ సందర్భంగా చాలా ఎగ్జైట్ అవుతూ తన ఫాలోవర్లకు థ్యాంక్స్ చెప్పాడు. వీళ్లందరూ ఫాలోవర్లు కాదని.. తన బిలీవర్స్ అని పేర్కొన్నాడు అఖిల్. వీళ్లందరూ తనను ప్రోత్సహిస్తూ.. మద్దతుగా నిలుస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అని అన్నాడు. అయితే ఈ ట్వీట్ చేసిన కొద్దిసేపటికి సమంత ‘ఐయామ్ ఎ బిలీవర్’ అంటూ అఖిల్ ట్వీట్ కి రిప్లై ఇచ్చింది. దీనికి బదులుగా ‘థ్యాంక్ యు వదినా’ అని ట్వీట్ చేశాడు అఖిల్.

ఇక అఖిల్ – విక్రమ్ కుమార్ కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకి ‘జున్ను’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఈ టైటిల్ బాగోలేదని .. మరేదైనా టైటిల్ చూడమని అభిమానులు అఖిల్ తో అంటున్నారట. అయితే విక్రమ్ కుమార్ ఈ టైటిల్ పట్ల ఎంతో ఆసక్తిగా వున్నాడని టాక్‌.

భారీ బడ్జెట్‌ తెరకెక్కుతున్న ఈ సినిమా పట్టాలెక్కక ముందే నెగెటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో, అఖిల్ ఆలోచనలో పడ్డాడట. విక్రమ్ కుమార్ తో చెప్పి టైటిల్ మార్పించాలనే ఆలోచన చేస్తున్నాడని అంటున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *