మహేష్ మూవీలో అల్లరోడు..!

ప్రస్తుతం మురుగదాస్ మూవీతో బిజీగా ఉన్న మహేష్ బాబు త్వరలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఈ మూవీ బైలింగ్యువల్ మూవీగా ఉండనున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ మూవీలో మహేష్ తో పాటు మరో హీరో కావలసి ఉండగా దర్శకుడు అల్లరి నరేష్ ని కలిసి కథని వినిపించాడట. ఆ స్టోరీకి ఇంప్రెస్ అయిన నరేష్ ఈ ప్రాజెక్ట్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నట్టు తెలుస్తుండగా, ఈ మూవీ ఓ రొమాంటిక్ థ్రిల్లర్ గా ఉంటుందని అంటున్నారు. యూఎస్ లో ఎక్కువ భాగం చిత్రీకరణ జరుపుకోనున్న ఈ చిత్రానికి సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ త్వరలోనే వెల్లడించనున్నారు. అల్లరి నరేష్ ప్రస్తుతం మలయాళ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు. ప్రజిత్ కరనవర్ దర్శకత్వంలో మేడ మీద అబ్బాయి అనే టైటిల్ తో ఈ మూవీ రూపొందుతుంది. ఈ ఏడాదిలోనే ఈ మూవీ రిలీజ్ కి ప్లాన్ చేశారు మూవీ మేకర్స్. ఇక మహేష్ – మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం జూన్ 23న విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *