పూజా హెగ్డేపై అల్లు అర్జున్ తీవ్ర అసంతృప్తి.. కారణమేమిటంటే..

వరుస హిట్లతో దూసుకెళ్తున్న అల్లు అర్జున్ తాజాగా దువ్వాడ జగన్నాథం చిత్రంతో మరోసారి సక్సెస్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రం కోసం అందాల తార పూజా హెగ్డేతో జతకట్టాడు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ చానెల్ ద్వారా అభిమానులతో సంభాషించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ పూజా హెగ్డే కూడా పాల్గొన్నారు. అయితే ఈ ఎపిసోడ్‌లో ఓ విషయంలో పూజాపై అల్లు అర్జున్ అసంతృప్తిని వ్యక్తం చేయడం ఆసక్తిగా మారింది.

దువ్వాడ జగన్నాథం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో హీరోయిన్ పూజా హెగ్డే మాట్లాడుతూ.. అల్లు అర్జున్‌తో నటించడం చాలా హ్యాపీగా ఉంది. అతను ఒక మంచి డ్యాన్సర్. అల్లు అర్జున్ టాలీవుడ్ మైఖేల్ జాక్సన్ అని కితాబు ఇచ్చింది. అందుకు వేదికపైనే అల్లు అర్జున్ సంతోషంతో పొంగిపోయాడు. ఆ తర్వాత పూజాపై కూడా స్టైలిష్ స్టార్ ప్రశంసల వర్షం కురిపించడంతో చెల్లుకు చెల్లు అయిపోయింది.

ఆదిత్య మ్యూజిక్ నిర్వహించిన చర్చ కార్యక్రమం కోసం ఒకే వేదికపైన మళ్లీ వారిద్దరూ కలుసుకొన్నారు. ఈ సందర్భంగా కూడా అల్లు అర్జున్ డ్యాన్స్ గురించే ప్రస్తావించింది. అతనితో డ్యాన్స్ చేయడం చాలా కష్టం అని చెప్పింది. అయితే తన నటన గురించి, యాక్షన్ గురించి పూజా చెప్పకపోవడం అల్లు అర్జున్ కొంత ఇబ్బందిగా ఫీలయ్యాడట.

ఎప్పుడూ నా డ్యాన్స్ గురించే పూజా మాట్లాడుతున్నది. ఆమెకు నేను ఒక డ్యాన్సర్‌గా మాత్రమే కనపడుతున్నానా? నాకు వేరే విధంగా కాంప్లిమెంట్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదే అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. నిజానికి ఈ చిత్రంలో అల్లు అర్జున్, పూజా చేసిన డ్యాన్స్‌లు బ్రహ్మండంగా కనిపిస్తున్నాయి. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయినట్టు స్పష్టమవుతున్నది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *