బన్నీకి ఎన్టీఆర్ కీ అదీ తేడా?

పబ్లిక్ ఫిగర్లుగా వున్నవాళ్లు మీడియాను బతిమాలి, బామాలుతూ వుండక్కర్లేదు కానీ, కనీసం మీడియా ఫ్రెండ్లీగా వుంటే చాలు. మీడియా జనాలు వాళ్లను నెత్తిన పెట్టుకుంటారు. అలా కాకుండా నా లెవెల్ ఏంటీ? ఈ మీడియా ఏంటీ అనుకునే వాళ్ల వ్యవహారాలు అందుకు తగినట్లే వుంటాయి.

డిజె సినిమా నుంచి హీరో అల్లు అర్జున్ కు మీడియాకు మధ్య అంతరం పెరుగుతూనే వస్తోంది. ఈప్రశ్నలు మాత్రమే అడగండి..ఇంతకు మించి అడగవద్దు అంటూ మీడియాను కట్టడి చేయడంతోనే విషయం మొదలయింది.

ఆ తరువాత ఈ నలుగురు చాలు, ఇంక ప్రెస్ మీట్లు, ఇంటర్వూలు అవసరం లేదు అని మొత్తం మీడియాను పక్కన పెట్టేసినపుడు మరింత రాజుకుంది. అక్కడితో ఆగకుండా రివ్యూలను, రివ్యూవర్లను టార్గెట్ చేయడం, పాఠాలు పీకడం, ఇవన్నీ మరింత పెంచాయి.

కానీ ఇదే సమయంలో ఎన్టీఆర్ ను చూడండి. బిగ్ బాస్ లాంటి భారీ ప్రోగ్రామ్ ను ఓకె చేసారు. ఇలాంటి డీల్ అంటే ఏ లెవెల్ జనాల మధ్య డిస్కషన్లు జరిగి వుంటాయో, ఎన్ని సిటింగ్ లు, ఎన్ని మీటింగ్ లు, ఎన్ని డిస్కషన్లు జరిగి వుంటాయో ఊహించుకోవచ్చు.

అయినా కూడా, ఎన్టీఆర్ ఓ కామన్ మీడియా పర్సన్ కు కూడా పని గట్టుకుని పబ్లిక్ లో థాంక్స్ చెప్పారు. మా టీవీ పీఆర్ వ్యవహారాలు చూసే రఘు తనను పట్టుపట్టి, ఈ కార్యక్రమానికి ఒప్పించాడని, థాంక్స్ అని ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నారు.

ఇది చాలు. ఇంతకన్నా మెచ్చి మేకతోలు కప్పక్కరలేదు. మీడియాకు. ఎన్టీఆర్ వ్యక్తిత్వం మీడియా దగ్గర అమాంతం పెరిగిపోవడానికి. ఇలా మీడియా ఫ్రెండ్లీగా వుండడం బన్నీకి ఎవరు నేర్పుతారో? మీడియా ఫ్రెండ్లీ అంటే మరేం కాదు.

తమ కళ్లతో మీడియాను కిందన వున్నట్లు చూడడం కాకుండా, తమతోనే వున్నట్లు సమాంతరంగా చూడడం. అంతే. మీడియా కిందన వున్నట్లు కిందగా చూస్తే, జనం మీదకు వచ్చేసాయి అనుకుంటారు. అది కామన్.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *