సినిమా బాగా నచ్చింది: అల్లు అర్జున్

తాజాగా విడుదలైన థ్రిల్ల‌ర్ చిత్రం ఎవరు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకుంది. ఈ సినిమాను చూసిన స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ‘‘ఎవరు’ చిత్ర బృందానికి అభినందనలు..  నిన్న రాత్రే సినిమా చూశాను. ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా చిత్రీకరించారు. ఊహించని మలుపులు, ట్విస్టులలతో సాగిన అద్భుతమైన మర్డర్ మిస్టరీ ఈ చిత్రం. సినిమా బాగా నచ్చింది. కథ, సాంకేతికత చాలా బాగుంది. రెజీనా, అడివి శేష్‌ చాలా బాగా నటించారు. చిత్రబృందానికి అభినందనలు.’ అంటూ ట్వీట్‌ చేశారు. అడివి శేష్‌, రెజీనా, నవీన్‌ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించారు. వెంకట్‌ రామ్‌జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కెవిన్‌ అన్నె నిర్మాతలు. పీవీపీ సంస్థ ఈ సినిమాను నిర్మించింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *