ప్రీ లుక్‌తో క్రేజ్‌ పెంచేశాడు…

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌ సినిమాలంటే జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. డిఫరెంట్ కథా చిత్రాలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించే బన్నీ సరైనోడు బ్లాక్ బస్టర్‌ హిట్‌ను తనఖాతాలో వేసుకున్నాడు. తర్వాత గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే.. దువ్వాడ జగన్నాథంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా గురించి అప్పుడప్పుడూ బయటికి వస్తున్న అప్ డేట్స్ కూడా సినిమా మీద అంచనాల్ని పెంచుతున్నాయి.

ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న ‘దువ్వాడ జగన్నాథం’ ఫస్ట్ లుక్ కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దీని కోసం జనాల్లో ఉన్న ఆసక్తిని మరింత పెంచేలా ఈ రోజు ‘డీజే’ ప్రి లుక్ ను లాంచ్ చేశాడు అల్లు అర్జున్.

‘డీజే’లో బన్నీ బ్రాహ్మణ కుర్రాడి పాత్రను పోషిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుండగా.. దాన్ని నిజం చేసేలా ఉంది ప్రి లుక్. రుద్రాక్ష దండ.. అడ్డ నామాలు.. ఈ వ్యవహారం చూస్తుంటే లుక్ జనాల అంచనాలకు తగ్గట్లే ఉండొచ్చనిపిస్తోంది. డీజే లుక్ ఇన్ 2 డేస్ అంటూ ఈ రోజే హ్యాష్ ట్యాగ్ పెట్టి అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.

ఇక మరోవైపు ఈ చిత్ర టీజర్‌ని శివరాత్రి కానుకగా 24న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అల్లు అర్జున్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా  దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వేసవిలో ముందుకు తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *