‘నేను నాన్న’ అల్లూ అర్జున్ కొత్త టైటిలా..

అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. గతంలో వీరి కాంబినేషన్‌లో రూపొందిన జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి సినిమాలు ఘనవిజయం సాధించటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను ఏఏ19గా అభివర్ణిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్‌ నేను నాన్న అంటూ ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది. మరోసారి ఫాదర్‌ సెంటిమెంట్‌తో తెరకెక్కిస్తున్న సినిమా కావటంతో ఈ సినిమాకు ఈ  టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఈ సినిమాలో టబు, జయరాం, సుశాంత్‌, మురళీ శర్మ, రావూ రమేష్‌, నవదీప్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పూజా హెగ్డే, నివేదా పేతురాజ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *