అమరావతి నా రాజధాని పేరుతో సినిమా

ఏపీలో అమరావతి రైతులు ఆందోళనలు రోజుకో ట్విస్ట్‌తో జనాలను గందరగోళంలోకి నెట్టేస్తోంది. మూడు రాజధానుల వైపు ప్రభుత్వం అడుగులు వేస్తోంటే.. విపక్షాలు మాత్రం రాజధానిగా అమరావతి  ముద్దు అంటున్నాయి.. హైకోర్టులో పిటిషన్లతో ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నారు. మరి రాజధాని వ్యవహారం సస్పెన్స్ థ్రిల్లర్‌లా ఉన్న అమరావతి కహానీని సినిమా తీస్తే ఎలా ఉంటుంది. అదే ఆలోచన లాయర్ శోభారాణికి వచ్చింది. సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు.. నెల రోజుల్లోనే విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. టీడీపీ నేత దివ్యవాణితో కలిసి అమరావతి నా రాజధాని పేరుతో మూవీ తీయబోతున్నట్లు ప్రకటించారు. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ఉద్యమం.. అక్కడ జరిగిన వాస్తవాల ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తామంటున్నారు.శోభారాణి గతంలో ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారు. ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశాక కొద్దిరోజులు రాజకీయాలకు దూరంగా ఉన్నారు.. తర్వాత టీడీపీలో చేరి కొద్దిరోజులు పనిచేశారు. మళ్లీ ఏమైందో రాజకీయాలకు దూరంగా ఉంటూ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అమరావతి రైతుల ఉద్యమానికి తన మద్దతు తెలిపారు. ఇప్పుడు సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు.

Videos