తలకు నువ్వుల నూనె అప్లై చేయటం వలన కలిగే లాభాలు

పోషక విలువలను కలిగి ఉండే నువ్వుల నూనె వలన ఆరోగ్యానికే కాక, జుట్టు రాలుటను తగ్గించటం, చుండ్రు నివారణ, వెంట్రుకలు రాలటం వంటి వాటి నుండి ఉపశమనం కలిగిస్తుంది. నువ్వుల నూనె జుట్టుకు పోషణ అందించటమేకాదు, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండటానికి కావలసిన సంక్లిష్ట విటమిన్ ‘B’, విటమిన్ ‘C’, మెగ్నీషియం, క్యాల్షియం, ఫాస్పరస్ అనేక పోషకాలను కలిగి ఉంటుంది.

నువ్వుల నూనెలో ఉండే ప్రోటీన్ లు జుట్టు మొదల్లను బలంగా మార్చి, వెంట్రుకలు రాలకుండా చూస్తాయి. కావున మీరు ఆలస్యం చేయకుండా మీ జుట్టుకు నువ్వుల నూనె అప్లై చేయటం ప్రారంభించండి.

నువ్వుల నూనె వలన మన జుట్టు కు కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుపబడింది.

వెంట్రుకలను మృదువుగా మారుస్తుంది

నువ్వుల నూనె ట్రాక్విలైజింగ్ గుణాలను కలిగి ఉండి, వెంట్రుకలను మృదువుగా మారుస్తుంది. సూర్యకాంతి వలన వెంట్రుకలు మరియు వాటి మొదల్లు ప్రమాదానికి గురవుతాయి. కూలింగ్ ఎఫ్ఫెక్ట్ ను కలిగి ఉండే నువ్వుల నూనె, తలను పూర్తిగా చల్ల బరుస్తుంది. అంతేకాకుండా, వెంట్రుకలకు కావలసిన తేమను కూడా అందిస్తుంది.

తెల్ల జుట్టును నివారిస్తుంది

మీ వెంట్రుకల రంగు మెరుగుపరుచువాలన్నా లేదా తెల్ల జుట్టును తొలగించుకోవాలన్నా నువ్వుల నూనెతో సాధ్యం అని చెప్పవచ్చు. రోజు నువ్వుల నూనెను మీ తలకు మసాజ్ చేయండి, ఫలితంగా, ప్రస్తుతం తెల్లగా ఉన్న జుట్టు క్రమంగా నల్లగా మారుపోతుంది.

seasam
seasam

వెంట్రుకల పెరుగుదలకు సహాయం

రసాయనిక సమ్మేళనాలు కలిగిన ఉత్పత్తుల వలన వెంట్రుకలు ప్రమాదానికి గురవుతాయి కావున నువ్వుల నూనెను వాడటం ద్వారా సహజంగా వెంట్రుకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వెంట్రుకలు పొడవుగా పెరగాలంటే, నువ్వుల నూనెతో రోజు తలపై మసాజ్ చేయండి. ఈ నూనె స్కాల్ప్ లో రక్త ప్రసరణను పెంచి, ప్రమాదానికి గురైన వెంట్రుకలను మరమ్మత్తుకు గురి చేసి, రాలిన వెంట్రుకలు తిరిగి పెరగటానికి సహాయపడుతుంది.

చుండ్రు నివారణ

చుండ్రు సమస్యలతో సతమతం అవుతున్నారా? అయితే నువ్వుల నూనెను వాడండి. దీనిలో మొదటగా, నువ్వుల నూనెను గోరు వెచ్చగా వేడి చేయండి. తరువాత, చేతి వేళ్ళ సహాయంతో స్కాల్ప్ పై మసాజ్ చేయండి. ఇలా రాత్రి పడుకునే ముందే నూనెను అద్ది, మరుసటి రోజు నీటితో కడగండి. ఇలా కనీసం నెల పాటూ చేయటం వలన చుండ్రు నుండి ఉపశమనం పొందుతారు.

పేను నివారణ

తలలో పేను సమస్యలతో బాధపడుతున్నారా? అయితే నువ్వుల నూనె వీటి నివారణకు సహాయపడుతుంది. యాంటీ బాక్టీరియల్ గుణాలను కలిగి ఉండే నువ్వుల నూనెను రోజు తలకు అప్లై చేయటం వలన పేను సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *