ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించనున్న అమెజాన్

2020 జూన్ నాటికి ఒకసారి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్ తో ప్యాకేజింగ్ ను పూర్తిగా నిలిపివేయాలని ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా నిర్దేశించుకుంది. మహాత్మాగాంధీ 150వ జయంతి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వచ్చే అక్టోబర్‌ 2వ తేదీని ప్లాస్టిక్‌ రహిత దినంగా పాటించాలని ఆకాశవాణిలో ప్రసారమయిన మాసాంతపు మన్‌కీబాత్‌లో ప్రధాని మోదీ కోరిన విషయం తెలిసిందే. దీనికి స్పందించిన అమెజాన్ ప్రస్తుతం తమ గిడ్డంగుల్లో ప్యాకేజింగ్ కు ఉపయోగించే ప్లాస్టిక్ లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాటా ఏడు శాతం కన్నా తక్కువే అని సంస్థ  వైస్ ప్రెసిడెంట్ అఖిల్ సక్సేనా తెలిపారు.

వ్యర్ధాలను తగ్గించుకొని, పర్యావరణ అనుకూల ప్యాకేజింగ్ లను ప్రోత్సహించాలన్న లక్ష్యానికి అమెజాన్ కట్టుబడి ఉందని ఆయన వివరించారు. బాబుల్ ర్యాప్స్, ఎయిర్ పి‌ఐ‌ఎల్లో మొదలయిన ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ఉత్పత్తుల స్థానంలో పేపర్ కుషన్ వినియోగించనున్నట్లు చెప్పారు. రీసైక్లింగ్‌కు ఉపయోగపడని ప్లాస్టిక్‌ను 25 శాతం తగ్గించామని, 2021 సంవత్సరం వరకు సంపూర్ణంగా నిషేధిస్తానమి ప్రకటించింది. ఈ నేపథ్యంలో స్పందించిన అమెజాన్‌ 2020 నాటికే నూటికి నూరు ఒకసారి మాత్రమే వాడే ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తామని హామీ ఇచ్చింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *