పాకిస్థాన్‌కు అగ్రరాజ్యం గట్టి షాక్
పాకిస్థాన్‌కు అగ్రరాజ్యం అమెరికా గట్టి షాకిచ్చింది. ఆ దేశానికిచ్చే ఇస్తామన్న ఆర్థిక సాయంలో 440 మిలియన్ డాలర్ల కోత విధించింది. పాక్‌కు ఇస్తామన్న దాంట్లో ఇక 4.1 బిలియన్ డాలర్లు మాత్రమే ఆర్థిక సాయం చేస్తామని ట్రంప్ సర్కార్ స్పష్టం చేసింది. పాక్‌కు అమెరికా ఆర్థిక సాయాన్ని తగ్గించడం ఇదే తొలిసారి కాదు. ఉగ్రవాదంపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ గతేడాది జనవరిలో పెంటగాన్ తామిచ్చే ఆర్థికసాయంలో 1 బిలియన్ డాలర్ల కోత విధించింది. అదే ఏడాది సెప్టెంబరులో మరో 300 మిలియన్ డాలర్ల సైనిక సాయాన్ని కూడా తగ్గించింది. అసలే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాక్‌కు ట్రంప్ తాజా నిర్ణయంతో గట్టి షాక్ తగిలినట్లయింది.