ఇండియా నిర్ణయాన్ని సమర్ధించిన అమెరికా

అత్యంత కరుడుగట్టిన ఉగ్రవాదుల పేర్లు భారత ప్రభుత్వం ప్రకటించడంపై అమెరికా హర్షం వ్యక్తం చేసింది. అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం, జైషే మహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్‌ మహమ్మద్‌ సయీద్, ముంబై ఉగ్రవాద దాడుల నిందితుడు జకీ ఉర్‌ రెహ్మాన్‌ లఖ్వీలను వ్యక్తిగత హోదాలో ఉగ్రవాదులుగా ప్రకటించడన్ని అగ్రరాజ్యం సమర్ధించింది.ఈ మేరకు దక్షిణ, మధ్య ఆసియా అసిస్టెంట్ సెక్రటరీ అలీస్ వెల్స్ గురువారం తెలిపారు.

ఉగ్రవాదాన్ని రూపుమాపడంలో భారత్ కు అమెరికా ఎల్లప్పుడు తోడుగా ఉంటుందని సృష్టం చేసింది. నలుగురు ఉగ్రవాదులు మౌలానా మసూత్‌ అజర్‌, హఫీజ్‌ సయీద్‌, జకీ ఉర్‌ రెహ్మాన్‌, దావూద్‌ ఇబ్రహీంలను ఉగ్రవాదులుగా గుర్తిస్తూ ఇండియా తీసుకున్న నిర్ణయానికి మద్దతు పలుకుతున్నాం. భారత్‌- అమెరికా కలిసి ఉగ్రవాదులను ఏరివేయడానికి ఈ కొత్త చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నాం’ అని అమెరికా దక్షిణ, మధ్య ఆసియా దేశాల వ్యవహారాల బ్యూరో వెల్లడించారు.

చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం 1967 కింద ఇప్పటి వరకు సంస్థలను మాత్రమే ఉగ్రవాదుల సంస్థగా ప్రకటించే అవకాశం ఉండేది. కానీ హతా నెల 2నా ఈ చట్టానికి సవరణలు చేస్తూ పార్లమెంటు కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్పడిన, వారికి సహాయపడిన, మద్దతు పలకిన, వారికి మద్దతుగా ప్రచారం చేసిన వారిని ఉగ్రవాదులుగా కింద లెక్కగాడతారు. ఈ చట్టం వచ్చిన తర్వాత తొలిసారిగా ఈ నాలుగురిని పేర్లు బయటపెట్టరు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *