ఢిల్లీలో పరిస్థితి కుదుటపడుతోందని అమిత్ షా అన్నారు

ఢిల్లీలో చెలరేగిన అల్లర్లపై ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. ఢిల్లీలో నేడు 10 గంటల పాటు కఠిన చట్టాల్ని అమలు చేస్తున్నట్లు.. ఉదయం 4 గంటల నుంచి 10 గంటల వరకు అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు గుంపులుగా ఉండరాదని, ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కాగా ఢిల్లీ అల్లర్ల విషయమై గురువారం నాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ ‘‘గడిచిన 36 గంటల్లో ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగలేదు’’ అని పేర్కొన్నారు.పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. సీఏఏ అనుకూలురు, వ్యతిరేకుల మధ్య తలెత్తిన వివాదం అల్లర్లుగా మారింది. ఈ అల్లర్లలో ఇప్పటికి 39 మంది మరణించారు. 45 మందిపై ఎఫ్ఐఆర్‌లు నమోదు అయ్యాయి. ఈ అల్లర్లపై నమోదైన వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు పిటిషన్‌ను నాలుగు వారాలకు వాయిదా వేసింది. కాగా, ఢిల్లీలో గడిచిన 36 గంటలుగా ఎలాంటి చేదు సంఘటనలు నమోదు కాలేదని గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది.

ప్రస్తుత కమిషనర్‌ అమూల్య పట్నాయక్‌ రేపు రిటైర్‌ కానుండడంతో ఆయన స్థానంలో శ్రీవాస్తవను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆదివారం ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.శ్రీవాస్తవ 1985 బ్యాచ్‌కు చెందిన అరుణాచల్ ప్రదేశ్- గోవా- మిజోరాం- కేంద్ర పాలితప్రాంతం (ఏజీఎంయూటీ) కేడర్ అధికారి. ప్రభుత్వం ఆయనను సీఆర్పీఎఫ్ నుంచి ఢిల్లీ పోలీస్ విభాగంలోకి తీసుకొచ్చి స్పెషల్ డైరెక్టర్ జనరల్‌గా పోస్టింగ్ ఇచ్చింది. ఢిల్లీలో స్పెషల్ సెల్ సహా పలు విభాగాలకు సేవలందించిన శ్రీవాస్తవ… ఇండియన్ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థపై దర్యాప్తులో కీలక పాత్ర పోషించారు. ట్రాఫిక్ విభాగంతో పాటు పలు జిల్లాల్లో కూడా ఆయన విజయవంతంగా సేవలందించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *