అమృత, ప్రణయ్‌ ప్రేమకథ ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’

స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమలు, ఉమ్మడి కుటుంబాల్లోని అనుబంధాలు, మానవ సంబంధాలు ఇతివృత్తంగా రూపుదిద్దుకొన్న ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’ చిత్రం మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 21న విడుదల కానుంది. సీనియర్‌ నటి అన్నపూర్ణమ్మ, మాస్టర్‌ రవితేజ టైటిల్‌ పాత్రలు పోషించారు. బాలాదిత్య, అర్చన హీరోహీరోయిన్లు. సెన్సార్‌ క్లీన్‌ యు సర్టిఫికెట్‌ పొందిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాత ఎమ్మెన్నార్‌ చౌదరి చెప్పారు. మిత్రుల సూచన మేరకు ఈ చిత్రాన్ని ప్రేక్షకుల జంట అమృత, ప్రణయ్‌లకు అంకితమిస్తున్నామని తెలిపారు. చిత్ర దర్శకుడు నర్రా శివనాగేశ్వరరావు మాట్లాడుతూ ‘మా సినిమాలో అక్కినేని అనసూయమ్మగా సీనియర్‌ నటి జమున నటించారు.మిర్యాలగూడలో జరిగిన అమృత, ప్రణయ్‌ ప్రేమకథలో బాలాదిత్య, అర్చన చక్కగా ఒదిగారు. రాజ్‌కిరణ్‌ సంగీతం చిత్రానికి హైలైట్‌ అవుతుంది’ అని చెప్పారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *