ఎన్టీఆర్ స‌ర‌స‌న అమీ జాక్స‌న్..?

ఎన్టీఆర్‌ త్రివిక్రమ్‌ కలయికలో సినిమా ఎప్పుడు సెట్స్‌ మీదకెళుతుందో క్లారిటీ లేదుగాని ఆ సినిమాపై వచ్చే వార్తలు అన్ని ఇన్ని కావు. అదిగో సినిమా అంటే, ఇదిగో హీరోయిన్ అంటూ వార్తలు వచ్చేస్తుంటాయి. అది కామన్. కానీ ఒక్కోసారి కొన్ని వార్తలు కలవరపెడుతుంటాయి. ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్‌ గా అను ఇమ్మాన్యువల్‌ని సెట్ చేసినట్టు వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఆమెను తీసుకోవడం లేదు… ఆమె స్థానంలో అమీ జాక్సన్‌ ను తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది.

అయితే అమీ జాక్సన్‌ ఎన్టీఆర్‌ హీరోయిన్‌ అని వార్తలు వస్తుండడంతో ఎన్టీఆర్‌ అభిమానులు భయపడుతున్నారు. ఎందుకంటే… అమీజాక్సన్ కు ఇప్పటి దాకా హిట్ అన్నది లేదు. పైగా చేసిన సినిమాల్లో 99శాతం డిజాస్టర్లే. అయినా దర్శకుడు శంకర్ మళ్లీ చాన్స్ ఇచ్చారు. రోబో 2లో ఆమెనే హీరోయిన్.అందువల్ల తెలుగు జనాలు టెంప్ట్ అయి ఆమెను తీసుకుంటున్నారేమో అని అనుమానం. అయితే ఎన్టీఆర్‌ త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే ఈ సినిమా మార్చిలో పట్టాలెక్కనుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *